నథింగ్ సబ్‌బ్రాండ్ CMF నుంచి తొలి స్మార్ట్‌ఫోన్.. ఫోటోలు విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు..!
నథింగ్ సబ్ బ్రాండ్ CMF నుంచి త్వరలో తొలి స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. దీనిని CMF సంస్థ ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. గతంలోని వచ్చిన కొన్ని నివేదికల ఆధారంగా నథింగ్ ఫోన్ 2a రీబ్రాండెడ్ వెర్షన్‌గా CMF ఫోన్ 1 (CMF Phone 1 Smartphone) విడుదల కానుందని తెలుస్తోంది. X (ట్విట్టర్) పోస్ట్ ద్వారా ఫోన్ విడుదలను నిర్ధారించిన సంస్థ.. Coming Soon అంటూ తెలిపింది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీలెవల్ ధరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.
ఇప్పటికి వరకు లీకైన వివరాల ఆధారంగా CMF ఫోన్ 1.. 6.7 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్ సహా థిక్ బెజెల్స్‌ను కలిగి ఉంటుందని సమాచారం. డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక కవర్ ప్లాస్టిక్‌తో (Replaceable Plastic) తయారు చేయబడుతుంది. మరియు వెనుక గ్లిఫ్ లైట్‌లను కలిగి ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

దీంతోపాటు ఈ సీఎంఎఫ్ ఫోన్ 1.. Nothing OS 2.6.0 తో పనిచేస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ వెర్షన్ అందుబాటులో లేదు. మరియు మీడియాటెక్ డైమెన్సటీ 7200 SoC పైన పనిచేస్తుందని తెలుస్తోంది. గరిష్ఠంగా 6GB ర్యామ్ సహా 128GB మరియు 256GB UFS 2.2 స్టోరేజీని కలిగి ఉండే అవకాశం ఉంది. మూడు సంవత్సరాలపాటు OS అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందవచ్చనని తెలుస్తోంది.
కెమెరా విభాగం పరంగా డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 50MP ప్రధాన కెమెరా సహా 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. 33W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.
ఇటీవలే నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2a స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ విడుదల అయింది. తొలిసారిగా నథింగ్ సంస్థ మల్టీ కలర్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం తెలుపు, నలుపు, నీలం రంగుల్లో నథింగ్ ఫోన్ 2a అందుబాటులో ఉండగా.. మే 29వ తేదీన ఎరుపు, పసుపు, నీలం రంగులతో మరో కలర్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇటీవలే ప్రారంభం అయింది.
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ స్పెషల్ ఎడిషన్ కేవలం 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.27,999 గా ఉంది. కలర్ మినహా స్టాండర్డ్ వేరియంట్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








