Home
Mobile

CMF Phone (1) రూ.12,000 ధరలో నథింగ్‌ సబ్‌బ్రాండ్‌ నుంచి తొలి స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్ల వివరాలు..!!

నథింగ్ సంస్థ నుంచి ఇటీవలే ఫోన్ 2a (Nothing Phone 2a) విడుదల అయింది. అయితే నథింగ్‌ సబ్‌ బ్రాండ్‌ CMF నుంచి త్వరలో తొలి స్మార్ట్‌ఫోన్‌ త్వరలో భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుందని తెలుస్తోంది. సీఎంఎఫ్‌ నుంచి ఇటీవల స్మార్ట్‌వాచ్‌ సహా ఇయర్‌బడ్స్‌ విడుదల అయ్యాయి.

CMF తొలి స్మార్ట్‌ఫోన్ పేరు CMF ఫోన్‌ 1 [CMF Phone (1)] గా ఉంటుందని తెలుస్తోంది. 91మొబైల్స్‌ ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. అయితే ఈ హ్యాండ్‌సెట్ తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. భారత్ మార్కెట్‌లో రూ.12,000 ధరకే విడుదల కానుందని తెలుస్తోంది.

CMF to launch its first smartphone soon

CMF తొలి స్మార్ట్‌ఫోన్.. ప్లాస్టిక్‌ బాడీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్‌ రక్షణను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు CMF ఫోన్‌ 1.. ఆరెంజ్‌, వైట్ మరియు బ్లాక్‌ వంటి మూడు రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది.

సీఎంఎఫ్‌ ఫోన్‌ (1).. 6.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటి 5G చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు సింగిల్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు నథింగ్ OS పైన పనిచేస్తుందని తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయి ఫీచర్లు కలిగి ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

ఈ హ్యాండ్‌సెట్‌ మూడు సంవత్సరాలపాటు OS అప్‌గ్రేడ్‌లు మరియు 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందించే అవకాశం ఉంది. దీంతోపాటు CMF ఫోన్‌ 1.. 33W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతోపాటు ఎప్పుడు విడుదల కానుందని వివరాలు వెల్లడించలేదు.

నథింగ్‌ ఫోన్‌ 2a స్పెసిఫికేషన్లు :
నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. గరిష్ఠంగా 12GB ర్యామ్, 256GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ OS 2.5 పైన పనిచేస్తుంది. మూడు సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని నథింగ్‌ సంస్థ వెల్లడించింది.

నథింగ్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) మరియు EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంటుంది. మరియు 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Sub Brand CMF to launch its first smartphone soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X