క్రిస్‌మస్ కోసం బ్లాక్‌బెర్రీ సూపర్ ఆఫర్

Posted By: Staff

క్రిస్‌మస్ కోసం బ్లాక్‌బెర్రీ సూపర్ ఆఫర్

 

డిసెంబర్ వచ్చిదంటే చాలు.. క్రిస్‌మస్ సంబరాలు. ఇందు కోసం కంపెనీలు ఎక్కువగా ఆఫర్లను కూడా ప్రకటిస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఆఫర్‌నే క్రిస్‌మస్ సంబరాల కోసం బ్లాక్‌బెర్రీ మొబైల్స్ తయారీదారు రీసెర్చ్ ఇన్ మోషన్ తమయొక్క కస్టమర్స్ కోసం అధ్బుతమైన ఫీచర్‌ బ్లాక్‌బెర్రీ మొబైల్స్‌లలో ప్రవేశపెట్టింది. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటంటే బ్లాక్‌బెర్రీ మొబైల్ ఓనర్స్ క్రిస్‌మస్ సంధర్బంగా తమయొక్క సన్నిహితులకు, శ్రేయోభిలాసులకు, స్నేహితులకు గిప్ట్స్‌ని 'బ్లాక్‌బెర్రీ మెసెంజర్(BBM)ఛాట్' ద్వారా పంపడం, రిసీవ్ చేసుకునే ఆఫ్షన్స్‌ని ప్రవేశపెట్టింది.

స్వతహాగా కెనడియన్ కంపెనీ అయిన రీసెర్చ్ ఇన్ మోషన్ ఆసియాలో కూడా ఇటీవలే తన అప్లికేషన్ స్టోర్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంలో సింగపూర్‌లో 'రీజినల్ డెవలపర్ ఈవెంట్'ని నిర్విహించడమే కాకుండా, వివిధ దేశాలకు సంబంధించిన జాతీయ భాషలలో ఇది సపోర్ట్ చేయనుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్‌బెర్రీ మొబైల్స్ చైనీస్, కోరియన్, థాయ్, ఇండోనేషియా, వియత్నాం, డచ్ భాషలను సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

BlackBerry Messenger (BBM) chat

 

క్రిస్‌మస్ సంధర్బంగా ప్రారంభించిన ఈ గిప్ట్స్ కాన్పెస్ట్ అనేది అన్ని భాషలను సపోర్ట్ చేయనుంది. సాధరణంగా ఈ గిప్ట్స్ కాన్పెస్ట్ ఆసియా మార్కెట్లో పెద్దగా క్లిక్ అవనప్పటికీ, దక్షణ దేశాలలో క్రిస్‌మస్ సంబరాలు ఎక్కవగా జరుపుకుంటారు కాబట్టి ఇది ఖచ్చితంగా పెద్ద సక్సెస్‌ని సాధిస్తుందని బ్లాక్‌బెర్రీ ప్రతినిధులు తెలిపారు. ఇది ఇలా ఉంటే అమెరికా కోర్టు ఆదేశానుసారం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 'బ్లాక్‌బెర్రీ బిబిఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్'ను 2012 కొత్త సంవత్సరంలో 'బ్లాక్‌బెర్రీ 10' గా మారుస్తున్నామన్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారకంగా తెలియజేసారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting