ఫ్లిప్‌కార్ట్‌లో షియోమి రెడ్‌మి నోట్‌ 5 ప్రొ పై బంపర్ ఆఫర్

By Anil
|

దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌, బిగ్‌ షాపింగ్‌ డేస్‌ ప్రమోషనల్‌ సేల్‌ ఈవెంట్‌కు తెరలేపిన సంగతి తెలిసిన విషయమే.కాగా ఈ సేల్‌ ఈ నెల జూలై 19న ముగుస్తుంది .అమెజాన్‌ ప్రైమ్‌ డేకు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ ఈ సేల్ ను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో షియోమి రెడ్‌మి నోట్‌ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చింది.ఎప్పటి నుంచొ రెడ్‌మి నోట్‌ 5 ప్రొ కొనుగోలు చేద్దామని ఎదురుచూస్తున్న వారు ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.645కే కొన్ని షరతులతో పొందవచ్చు.

 

 బిగ్‌షాపింగ్‌ డేస్‌ ప్రమోషనల్‌ సేల్‌ ఈవెంట్‌ సందర్భంగా:

బిగ్‌షాపింగ్‌ డేస్‌ ప్రమోషనల్‌ సేల్‌ ఈవెంట్‌ సందర్భంగా:

గతంలో రెడ్‌మి నోట్‌ 5 ప్రొ బేస్‌ వెర్షన్ 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ.14,999 కాగ, హై ఎండ్‌ వెర్షన్‌ 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర 16,999 రూపాయలు . అయితే బిగ్‌షాపింగ్‌ డేస్‌ ప్రమోషనల్‌ సేల్‌ ఈవెంట్‌ సందర్భంగా బేస్ వెర్షన్‌ను రూ.649తో హై -ఎండ్‌ వెర్షన్‌ను రూ.2,649తో ఫ్లిప్‌కార్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు.

రెండు విధాలుగా పొందవచ్చు:

రెండు విధాలుగా పొందవచ్చు:

ఈ డిస్కౌంట్‌ను కస్టమర్లు రెండు విధాలుగా పొందవచ్చు ఒకటి స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్‌లో కొనుగోలు చేయాలి లేదా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేయాలి . ఏదైన స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజి పై రూ.12,850 వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తుంది. SBI క్రెడిట్‌ కార్డులపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను కూడా ఇస్తోంది. ఈ రెండు విధాలుగా రెడ్‌మి నోట్‌ 5 ప్రొ పై డిస్కౌంట్‌ను పొందొచ్చు . మీరు ఎక్స్చేంజ్‌ చేసే స్మార్ట్‌ఫోన్‌ రూ.12,850 డిస్కౌంట్‌కు అర్హత కలిగి ఉండి, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు కలిగి ఉంటే చాలు రూ.649కు రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ను మీరు కొనుగోలు చేయవచ్చు.

 కేవలం Oneplus 5T  ఎక్స్చేంజీని చేసుకోవచ్చు:
 

కేవలం Oneplus 5T ఎక్స్చేంజీని చేసుకోవచ్చు:

అయితే ఐఫోన్‌ 6ఎస్‌ను, లేటెస్ట్‌ గూగుల్‌ పిక్సెల్‌ 2ను, షియోమీ MI 5ను ఎక్స్చేంజ్‌ చేసుకునే వీలులేదు. కేవలం Oneplus 5T మాత్రమే ఎక్స్చేంజీని చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్‌తో రూ.12,850 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. ఒకవేళ రెడ్‌మి నోట్‌ 4 ఎక్స్చేంజ్‌లో కొంటే రూ.3600 వరకు తగ్గింపు వస్తోంది.దీనితో పాటు SBI క్రెడిట్‌ కార్డు ఉంటే, అదనంగా మరో రూ.1500 తగ్గుతోంది. దీంతో రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ధర రూ.14,999 నుంచి రూ.9,899కు తగ్గిపోతుంది.

రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి :

రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి :

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 Noughat , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Best Mobiles in India

English summary
Now buy Xiaomi Redmi Note 5 Pro for as low as Rs 649.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X