మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసే ప్రత్యేక షార్ట్స్!!

Posted By:

సూర్యుని కిరణాల ద్వారా శక్తిని గ్రహించి, ఆ శక్తితో మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసే ప్రత్యేక షార్ట్‌లను లండన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ప్రత్యేక పవర్ షార్ట్‌లను ధరించిన వారు తమ తమ సెల్‌ఫోన్‌లను షార్ట్‌కు సంబంధించిన జేబులో పెట్టుకున్నట్లయితే సదరు డివైజ్ ఛార్జ్ అవటం మొదలవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ పవర్ షార్ట్‌లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ దీనిని ధరించిన వ్యక్తి నడుస్తున్న సమయంలో సోలార్ శక్తిని గ్రహించి స్టోర్ చేస్తుంది.

మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసే ప్రత్యేక షార్ట్స్!!

చల్లటి బీర్‌తో సెల్ ఛార్జింగ్!

ఇక పై చల్లటి బీర్‌లేదా హాట్ కాఫీతో మీ మొబైల్ ఫోన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇందకు దోహదపడే ప్రత్యేక డివైజ్‌ను యూఎస్‌కు చెందిన ఎపిఫనీ ల్యాబ్స్ వృద్ధి చేసింది. ‘ఆన్-ఈ పుక్' గా పిలవబడుతున్న ఈ కోస్టెర్ రెండు భాగాలను కలిగి ఉంటుంది. ఈ పుక్‌లోని ఎరుపు భాగం పై హాట్ డ్రింక్ మగ్‌ను, బులుగు భాగం పై చల్లటి డ్రింక్ మగ్‌ను ఉంచటం వల్ల శక్తి ఉత్పన్నమై యూఎస్బీ కేబుల్ ఆధారంగా స్మార్ట్‌ఫోన్‌కు అందుతుంది. ఇందుకుగాను స్టిర్లింగ్ ఇంజిన్ వ్యవస్థను ఆన్-ఈ పుక్ డివైజ్‌లో వినియోగించారు. ఈ తక్కువ బరువు పోర్టబుల్ డివైజ్‌ను ప్రయాణ సందర్భాల్లో సలువుగా క్యారీ చేయవచ్చు. విద్యుత్ సదుపాయంలో లేని ప్రాంతాల్లో ఈ కోస్టెర్‌ను ఉపయోగించుకుని యూఎస్బీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot