'బ్లాక్‌‌బెర్రీ అప్లికేషన్ వరల్డ్ 3.1' అదుర్స్..

Posted By: Staff

'బ్లాక్‌‌బెర్రీ అప్లికేషన్ వరల్డ్ 3.1' అదుర్స్..

 

ఇండియన్ మార్కెట్లోకి మొట్టమొదటి స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసిన కంపెనీగా బ్లాక్‌‌బెర్రీని అభివర్ణించవచ్చు. బ్లాక్‌‌బెర్రీ స్మార్ట్ ఫోన్స్ బిజినెస్ అప్లికేషన్స్‌, ఈ మెయిల్ అప్లికేషన్స్‌కి పెట్టింది పేరు అన్న విషయం తెలిసిందే. ఇక మల్టీ మీడియా ప్రత్యేకతలను కూడా బ్లాక్‌‌బెర్రీ స్మార్ట్ ఫోన్స్ అన్ని రకలా మల్టీమీడియా ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. అలాంటి బ్లాక్‌‌బెర్రీ కొత్తగా రూపొందించిన 'బ్లాక్‌‌బెర్రీ అప్లికేషన్ వరల్డ్ 3.1'ని విడుదల చేయడానికి సిద్దంగా ఉంది.

ఈ అప్లికేషన్ వల్ల బ్లాక్‌‌బెర్రీ మొబైల్ కస్టమర్స్‌కి ఇంటర్నెట్ మరింత సులభం కానుంది. ఈ అప్లికేషన్ మొబైల్‌లో ఉండడం వల్ల డేటా కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్‌కి కనెక్టు అయి ఎటువంటి మొబైల్ అప్లికేషన్‌నైనా డౌన్‌లోడ్ చేసుకునే వెసులు బాటు కల్పించడం జరిగింది. గతంలో బ్లాక్‌‌బెర్రీ విడుదల చేసిన గ్రూప్‌ఆన్ అప్లికేషన్ ఎలాగైతే ఆకర్షించే షాపింగ్ డీల్స్‌ని అందిస్తుందో , అలాంటి కొత్త కొత్త అప్లికేషన్స్‌ని దీని ద్వారా పొందవచ్చు.

బ్లాక్‌‌బెర్రీ రూపొందించిన ఈ కొత్త 'బ్లాక్‌‌బెర్రీ అప్లికేషన్ వరల్డ్ 3.1' అప్లికేషన్ ప్రస్తుతం కెనడా, యుఎస్‌ఎలలో మాత్రమే లభ్యమవుతుంది. ప్రస్తుతం బ్లాక్‌‌బెర్రీ 5 ఆపరేటింగ్ సిస్టమ్‌ని వాడుతున్నటువంటి మొబైల్ యూజర్స్ ఈ గ్రూప్ ఆన్ అప్లికేషన్‌ని ఉచితంగా పొందవచ్చు. ఇక 'బ్లాక్‌‌బెర్రీ అప్లికేషన్ వరల్డ్ 3.1' విషయానికి వస్తే సెప్టెంబర్ 2011లో బ్లాక్‌‌బెర్రీ విడుదల చేసిన అప్లికేషన్ వరల్డ్ 3 తర్వాత వస్తున్న లేటెస్ట్ కొత్త అప్లికేషన్. బ్లాక్‌‌బెర్రీ ప్లే బుక్ లో కూడా 'బ్లాక్‌‌బెర్రీ అప్లికేషన్ వరల్డ్ 3.1' అప్లికేషన్‌ని అందుబాటులో ఉంచారు.

కెనడా మార్కెట్లో 'బ్లాక్‌‌బెర్రీ అప్లికేషన్ వరల్డ్ 3.1' ప్రస్తుతం ఓ సరిక్రొత్త సంచలనం. ప్రత్యేకంగా యూత్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ 'బ్లాక్‌‌బెర్రీ అప్లికేషన్ వరల్డ్ 3.1'ని రూపొందించడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot