అప్‌డేట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో..

By Super
|
HTC Droid


హెచ్‌టిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హెచ్‌టిసి డ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మరో కొత్త అప్‌డేట్‌ మార్కెట్లో లభించనుంది. హెచ్‌టిసి డ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ని మొదటి సారి మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు ఆండ్రాయిడ్ 1.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదల చేయడం జరిగింది. కానీ ఇటీవల మార్కెట్లోకి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన అప్‌డేట్ వర్సన్స్ లభించడంతో హెచ్‌టిసి డ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ని కూడా యూజర్స్ అప్‌డేట్ చేసుకునే వెసులుబాటుని కల్పించడం జరిగింది.

 

ప్రస్తుతం ఎవరైతే యూజర్స్ హెచ్‌టిసి డ్రాయిడ్ మొబైల్ ఫోన్‌ని వాడుతున్నారో వారు కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన ఆండ్రాయిడ్ 2.3.4 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి అప్ గ్రేడ్ అవ్వొచ్చు. డౌన్‌లోడ్ మేనేజర్ ద్వారా కస్టమర్స్ ఈ ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించిన అప్లికేషన్‌ని బ్రౌజర్ ద్వారా పొందవచ్చు. ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేసుకొవడం వల్ల యూజర్స్ ఈజీగా బ్లూటూత్ ద్వారా ఇంటర్నెట్‌కి కనెక్ట్ అవ్వోచ్చు. హెచ్‌టిసి డ్రాయిడ్ మొబైల్ ఫీచర్స్‌ని ఒక్కసారి గమనించినట్లేతే.....

 

హెచ్‌టిసి డ్రాయిడ్ మొబైల్ ప్రత్యేకతలు:

బరువు: 4.43 oz (126 g)

చుట్టుకొలతలు : 4.45" x 2.19" x 0.52" (113 x 55 x 13.2 mm)

డిస్ ప్లే టైపు: LCD (Color TFT/TFD)

డిస్ ప్లే రిజల్యూషన్: 320 x 480 pixels, 3.2" diagonal

ఆపరేటింగ్ సిస్టమ్: Android version 1.5

ప్రాసెసర్: 528 MHz MSM7600

మెమరీ: 147 MB internal storage, available to user, plus 8 GB included

బ్యాటరీ: 1300 mAh LiIon

బ్యాటరీ టాక్ టైమ్: 5 hours max

బ్యాటరీ స్టాండ్ బై టైమ్: 420 hours max

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X