జియో నుంచి ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్, షరతులపై సస్పెన్స్ !

Written By:

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో త్వరలో ఓ సరికొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఎల్‌వైఎఫ్‌ బ్రాండు కింద ఆల్ట్రా లో-ధరతో ఆండ్రాయిడ్‌ గో ఆధారితంగా 4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయాలని రిలయన్స్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటికే 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసి సక్సెస్ అయిన జియో ప్రస్తుతం ఈ ఫోన్‌ను ఓపెన్ సేల్‌లో విక్రయిస్తున్నది. ఈ క్రమంలోనే 4జీ ఫీచర్ ఫోన్‌కు వచ్చిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని జియో సంస్థ 4జీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ మేరకు జియో చిప్ తయారీ సంస్థ మీడియాటెక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

జియో నుంచి 4 add-on packs, తక్కువ ధర, నో వ్యాలిడిటీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దేశీయ టెల్కోలకు గట్టి పోటీ..

ఈ డివైజ్‌తో దేశీయ టెల్కోలకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు మరింత మంది కస్టమర్లను తన సొంతం చేసుకోనేలా రిలయన్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశీయ టెలికాం కంపెనీలు, మొబైల్‌ తయారీదారులతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని 4జీ స్మార్ట్‌ఫోన్లను క్యాష్‌బ్యాక్‌ల ద్వారా రూ.1500 కంటే తక్కువకే ఆఫర్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

అత్యంత తక్కువ ధరల్లో..

ఈ క్రమంలో జియో కూడా అత్యంత తక్కువ ధరల్లో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయాలని చూస్తోంది. జియోఫోన్‌కు అవలంభించిన విధానాన్నే ఈ స్మార్ట్‌ఫోన్‌కు అనుసరించాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ యోచిస్తున్నట్టు సంబంధిత వ్యక్తులు చెప్పారు.

సిమ్‌తో పాటు, పలు ఆఫర్లతో..

దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ రిలయన్స్‌ జియో సిమ్‌తో పాటు, పలు ఆఫర్లతో వినియోగదారుల ముందుకు రానుంది. ఈ 4జీ డివైజ్‌ మిలియన్‌ యూనిట్ల ఆర్డర్లను కూడా రిలయన్స్‌ త్వరలోనే స్వీకరించనుందని ఓ అధికారి చెప్పారు. ధర, వాడకం వంటి కారణాలతో 500 మిలియన్‌ మంది ఫీచర్‌ ఫోన్‌ యూజర్లు, స్మార్ట్‌ఫోన్లలోకి మారలేకపోతున్నారని, వారిని టార్గెట్‌ చేసుకునే రిలయన్స్‌ ఈ ప్లాన్స్‌ చేస్తున్నట్టు సమాచారం.

మీడియాటెక్‌ ధృవీకరణ

ముఖేష్‌ అంబానీకి చెందిన 4జీ టెలికాం ఆపరేటర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు చిప్‌సెట్‌ తయారీదారి మీడియాటెక్‌ ధృవీకరించింది. ఆండ్రాయిడ్‌ గో స్మార్ట్‌ఫోన్‌పై జియో బులిష్‌గా ఉందని, తమతో కలిసి రిలయన్స్‌ పనిచేస్తుందని మీడియాటెక్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేట్‌ సేల్స్‌ కంట్రీ హెడ్‌ కుల్దీప్‌ మాలిక్‌ తెలిపారు.

512 ఎంబీ లేదా 1జీబీ ర్యామ్

జియో విడుదల చేయనున్న నూతన ఆండ్రాయిడ్ ఫోన్‌లో 512 ఎంబీ లేదా 1జీబీ ర్యామ్ ఉండవచ్చని తెలిసింది. ఈ క్రమంలో ఈ ఫోన్ ధర కూడా రూ.2వేల లోపే ఉండనుందని సమాచారం. అదే నిజమైతే జియో మరో సంచలనానికి తెర తీయడం ఖాయంగా కనిపిస్తున్నది. అతి త్వరలో జియో నూతన స్మార్ట్‌ఫోన్ గురించిన వివరాలు తెలియనున్నాయి.

 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Now, Jio plans to launch a ‘dirt cheap’ smartphone More News at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot