ఐఫోన్ వద్దనుకునే టైం వచ్చింది, ఎందుకో మీరే చూడండి

ఫోన్లు కొనుగోలు చేయానికి ఎంతటి సాహసానికి అయినా ఒడిగడతారు. అయితే ఇప్పుడు ఆ ఫోన్లను వద్దనుకునే టైం వచ్చింది.

|

ప్రపంచపు దిగ్గజ టెక్ గెయింట్ ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఐఫోన్లు అంటే అందరికీ చాలా ఇష్టం. ఈ ఫోన్లు కొనుగోలు చేయానికి ఎంతటి సాహసానికి అయినా ఒడిగడతారు. అయితే ఇప్పుడు ఆ ఫోన్లను వద్దనుకునే టైం వచ్చింది. ఎలాగంటారా ఈ ప్లేసుని ఇప్పుడు వన్‌ప్లస్ 6టి ఆక్రమించబోతోంది. వన్‌ప్లస్ నుంచి దూసుకొచ్చిన వన్‌ప్లస్ 6టి మార్కెట్లో దుమ్మురేపుతోంది. అదిరిపోయే ఫీచర్లు ఆఫర్లతో వచ్చిన ఈ ఫోన్ కొనుగోలుదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఐఫోన్ కి ఎక్కువ ఖర్చు పెట్టలేని అభిమానులు ఈ ఫోన్ మీదకు తమ దృష్టిని మరల్చారు. మరి ఈ ఫోన్ అంతలా వారిని ఆకట్టుకుంటుందంటే అందులో ఏమీ ఫీచర్లు ఉన్నాయి. ఎటువంటి ఆఫర్లు ఉన్నాయనే దానిపై ఓ లుక్కేద్దాం పదండి.

వన్‌ప్లస్ 6టి ఫీచర్లు

వన్‌ప్లస్ 6టి ఫీచర్లు

వన్‌ప్లస్ 6టి ఫోన్‌లో 6.41 ఇంచుల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

 

 

 ఆఫర్లు...

ఆఫర్లు...

వన్ ప్లస్ 6టి ఫోన్ లాంచింగ్ సందర్భంగా వినియోగదారులకు పలు ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. ఫోన్‌ను కొన్న వారికి నో కాస్ట్ ఈఎం సదుపాయం అందుబాటులో ఉంటుంది.

 క్యాష్ బ్యాక్

క్యాష్ బ్యాక్

అమెజాన్ పే ద్వారా కొంటే రూ.1వేయి క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.5400 విలువగల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ను 36 వోచర్ల రూపంలో జియో అందిస్తున్నది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారు కోటక్ 811 అకౌంట్ తీసుకుంటే రూ.2వేల విలువైన యాక్సిడెంట్ అండ్ లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్‌ను ఉచితంగా పొందవచ్చు.

సిటిబ్యాంక్ రూ.1500 క్యాష్ బ్యాక్ ఆఫర్ ని అందిస్తోంది. ఈ ఆఫర్ డిసెంబర్ 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ పొందాలంటే మీరు సిటిబ్యాంక్ డెబిట్ కార్డు కాని క్రెడిట్ కార్డు కాని కలిగి ఉండాలి. ఈ కార్డులు మీ దగ్గర ఉన్నట్లయితే అమెజాన్ ఇండియా సైటు ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అయితే ఇది కూడా లిమిటెడ్ పిరియడ్ ఆఫర్లో ఉన్నందున ఓ సారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. మీరు మినిమం రూ.22 వేలను ఒకేఒక లావాదేవీతో జరపాల్సి ఉంటుంది. ఇలా లావాదేవీ జరిపిన వారికి రూ.1500 క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మీరు రూ, 4500 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ మొత్తం మీకు మార్చి 10 2019న క్రెడిట్ అవుతుంది.

 

 

 

వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్‌

వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్‌

వన్‌ప్లస్ 6టి స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ భారత్‌లో రూ.37,999కు అందుబాటులో ఉంది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.41,999 ఉండగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.45,999 గా ఉంది.

 

 

 విడుదల సందర్భంగా పాపప్ ఈవెంట్లను వన్‌ప్లస్ నిర్వహించింది...

విడుదల సందర్భంగా పాపప్ ఈవెంట్లను వన్‌ప్లస్ నిర్వహించింది...

ఈ ఫోన్ విడుదల సందర్భంగా ఈ నెల 2వ తేదీన బెంగళూరు, ముంబై, పూణె, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లలో వన్‌ప్లస్ 6టి పాపప్ ఈవెంట్లను వన్‌ప్లస్ నిర్వహించింది. వీటికి వన్‌ప్లస్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వన్‌ప్లస్ నూతనంగా విడుదల చేసిన వన్‌ప్లస్ 6టి ఫోన్‌ను ఈ పాపప్ ఈవెంట్లలో యూజర్లు పెద్ద ఎత్తున అనుభూతి చెందారు. అంతేకాకుండా ఫోన్ కొనుగోలు పట్ల కూడా వారు విశేష స్పందన కనబరుస్తున్నారని వన్‌ప్లస్ తాజాగా వెల్లడించింది.

ఇన్ని రకాల ప్రత్యేకతలతో వచ్చిన ఈ ఫోన్‌కు చెందిన అన్ని వేరియెంట్లు ప్రస్తుతం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఐపోన్ ని కొనుగోలు చేయలేని వారు ఈ ఫోన్ కొనుగోలుతో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టే కంటే అత్యంత తక్కువ ధరలో వచ్చిన ఈ ఫోన్ చాలా బాగుందని చెబుతున్నారు.

 

Best Mobiles in India

English summary
Now might be a really good time to switch from iPhones to the OnePlus 6T more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X