నోకియా టాప్‌క్లాస్ స్మార్ట్‌ఫోన్ జస్ట్ ఫర్ 9,299!!

ప్రపంచవ్యాప్తంగా నోకియాకు లభిస్తున్న ఆదరణ చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్చపోవల్సిందే. విశ్వసనీయతకు పెద్దపీట వేసే నోకియా మన్నిక, క్వాలిటీ, పనితీరు వంటి ఉత్తమ అంశాలను పరిగణలోకి తీసుకుని గ్యాడ్జెట్‌లను డిజైన్ చేస్తుంది. ఈ టాప్‌క్లాస్ బ్రాండ్ భారతీయుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. సింబియాన్ అన్నా ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్ ‘నోకియా 500’ను ఇప్పుడు కేవలం రూ.9,299 చెల్లించి సోంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. స్మార్ట్‌ఫోన్ కోనుగోలు చేసే ఆలోచనలో ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
నోకియా 500 కీలక ఫీచర్లు:
* సింబియాన్ అన్నా ఆపరేటింగ్ సిస్టం,
* 1జిగాహెడ్జ్ ఆర్మ్ ప్రాసెసర్,
* హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
* 5 మెగా పిక్సల్ ఉత్తమ క్వాలిటీ కెమెరా,
* వీజీఏ వీడియో రికార్డింగ్,
* 2జీబి ఇంటర్నల్ మెమెరీ,
* మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పెంచుకునే సాలభ్యత,
* ఇన్‌బుల్ట్ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్,
* వేగవంతమైన ఇంటర్నెట్ సపోర్ట్, ఈ-మెయిల్ సపోర్ట్,
ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అదనపు ఫీచర్లు:
జీపీఎస్ సపోర్ట్,
డిజిటల్ కంపాస్,
3జీ కనెక్టువిటీ.
ఈ ఫోన్ ద్వారా ఇంటర్నెట్‌ను వేగవంతంగా కనెక్ట్ చేసుకోవచ్చు. వివిధ రకాలైన గేమ్‌లను సైతం ప్లే చేసుకోవచ్చు. ఉత్తమ మొబైలింగ్, కంప్యూటింగ్ విలువలను కలిగి ఉన్న నోకియా ఇ500 కొత్త తరహా అనుభూతలకు లోనుచేస్తుంది.


Click it and Unblock the Notifications