జియో సంచలనం.. రూ.309కే 448జీబి డేటా, 8 నెలలు వాడుకోవచ్చు

జియో మరోసారి సామ్‌సంగ్‌తో చేతులు కలిపింది. కొద్ది గంటల క్రితం సామ్‌సంగ్ లాంచ్ చేసిన గెలాక్సీ ఎస్8, ఎస్8+ ఫోన్‌ల పై డబుల్ డేటా ఆఫర్‌ను రిలయన్స్ జియో ప్రకటించింది.

Read More : జియో సిమ్ ఎప్పటి వరకు పని చేస్తుంది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.309 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 448జీబి డేటా..

గెలాక్సీ ఎస్8, ఎస్8+ ఫోన్‌ల ఫోన్‌లను కొనుగోలు చేసే జియో యూజర్లు రూ.309 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా చేసుకోవటం ద్వారా 448జీబి జియో డేటాను అందిస్తామని రిలయన్స్ ప్రకటించింది. ఈ డేటాను 8 నెలల పాటు రోజుకు 2జీబి చొప్పున వాడుకోవచ్చు.

మే 5 నుంచి మార్కెట్లో...

గెలాక్సీ ఎస్8, ఎస్8+ ఫోన్‌లు మే 5 నుంచి మార్కెట్లో లభ్యమవుతాయి. ఆన్‌లైన్ అలానే ఆఫ్‌లైన్ మార్కెట్లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం..

ఆన్‌లైన్‌లో ఈ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ అలానే సామ్‌సంగ్ ఇండియా స్టోర్‌లు విక్రయిస్తాయి. ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గెలాక్సీ ఎస్8 మోడల్ ధర రూ.57,900. గెలాక్సీ ఎస్8+ మోడల్ ధర రూ.64,900.

గెలాక్సీ ఎస్8, ఎస్8+ స్పెసిఫికేషన్స్...

గెలాక్సీ ఎస్8, 5.8 అంగుళాల క్యూహైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది (రిసల్యూషన్ కెపాసిటీ 1440x 2960పిక్సల్స్). ఇదే సమయంలో గెలాక్సీ ఎస్8+ 6.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది (రిసల్యూషన్ కెపాసిటీ 1440x 2960పిక్సల్స్). భారత్‌లో అందుబాటులో ఉండే గెలాక్సీ ఎస్8 వేరియంట్స్ సామ్‌సంగ్ Exynos 8895 SoC పై రన్ అవుతాయి.

కెమెరా విషయానికి వచ్చేసరికి..

గెలాక్సీ ఎస్8, ఎస్8+ ఫోన్‌లు 12 మెగా పిక్సల్ డ్యుయల్ పిక్సల్ రేర్ కెమెరాలతో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాతో వస్తున్నాయి.

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి..

గెలాక్సీ ఎస్8, ఎస్8+ ఫోన్‌లు 64జీబి ఇన్ బిల్ట్ స్టోరేజ్‌తో వస్తున్నాయి. మైక్రోఎస్డీ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కాన్ఫిగరేషన్‌

హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కాన్ఫిగరేషన్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లు 4G LTEని సపోర్ట్ చేస్తాయి. . బ్లుటూత్ 5 కనెక్టువిటీ స్టాండర్డ్, ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్, బిక్స్‌బై డిజిటల్ అసిస్టెంట్ వంటి విప్లవాత్మక ఫీచర్లను ఈ ఫోన్‌లలో సామ్‌సంగ్ పొందుపరిచింది.

ఐపీ68 రేటింగ్‌...

ఐపీ68 రేటింగ్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు దమ్ము ఇంకా నీటి ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకోగలవు. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి గెలాక్సీ ఎస్8 మోడల్ 3000mAh బ్యాటరీతో ప్యాక్ అయి ఉంటుంది. ఎస్8 ప్లస్ మోడల్ 3500mAh బ్యాటరీతో ప్యాక్ అయి ఉంటుంది. ఈ రెండు బ్యాటరీలు వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Now Samsung Galaxy S8 and S8+ Users Will Get 448 GB Data From Reliance Jio. Read More in Gizbot Telugu...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting