ఆఫ్‌లైన్ మార్కెట్లోకి జియోఫోన్, బుకింగ్, ధరల వివరాలు తెలుసుకోండి !

Written By:

జియోఫోన్ ఇప్పుడు మార్కెట్లో ఓ సంచలనం. ఆ ఫోన్ కోసం అందరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఫోన్ కొనుగోలుకు వచ్చిన గంటల వ్యవధిలోనే అవుట్ ఆఫ్ స్టాక్ అని దర్శనమిస్తోంది. దీంతో కొనుగోలుదారులు తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు.దీంతో జియో కొత్త ఎత్తుగడలకు తెరలేపింది. ఆఫ్ లైన్ మార్కెట్లతో చేతులు కలిపింది. మొబిక్విక్ తో జట్టుకట్టి జియోఫోన్ మార్కెట్లోకి తీసుకొస్తోంది.మరి బుకింగ్ వివరాలు ఎలా అనే వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

లీకయిన Xiaomi కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, 8జిబి ర్యామ్‌, ఇంకా అదిరే ఫీచర్లతో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్‌ జియో, మొబైల్‌ వాలెట్‌ మొబిక్విక్‌తో..

ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో, మొబైల్‌ వాలెట్‌ మొబిక్విక్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో తమ ప్లాట్‌ఫామ్‌పై జియోఫోన్‌ను విక్రయించనున్నట్టు మొబిక్విక్‌ ప్రకటించింది. '' జియోఫోన్‌ను విక్రయిస్తున్న తొలి మొబైల్‌ వాలెట్‌ మాదే కావడం మేము చాలా గర్వంగా భావిస్తున్నాం.

సులభతరమైన స్టెప్స్‌తో..

నాలుగు సులభతరమైన స్టెప్స్‌తో యూజర్లు జియోఫోన్‌ను బుక్‌ చేసుకోవచ్చు. అదేవిధంగా పలు గ్రేట్‌ ప్రయోజనాలను అందించనున్నాం'' అని మొబిక్విక్‌ బిజినెస్‌ హెడ్‌ బిక్రమ్‌ బిర్‌ సింగ్‌ తెలిపారు. దీంతో జియోఫోన్‌ను విక్రయిస్తున్న తొలి ప్లాట్‌ఫామ్‌ తమదేనని మొబిక్విక్‌ పేర్కొంది. ఫోన్‌ నెంబర్ల ద్వారా కూడా జియోఫోన్‌ను బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.

జియో ఫోన్ ఫీచర్లు

2.4 అంగుళాల QVGA టీఎఫ్టీ డిస్‌ప్లే, 1.2GHz సీపీయూ, 512MB ర్యామ్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వీజీఏ కెమెరా, 4G VoLTE సపోర్ట్, ఇంటర్నెట్ షేరింగ్ హాట్ స్పాట్ సదుపాయం,డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ (4జీ సిమ్ + 2జీ సిమ్), 2000mAh బ్యాటరీ, మ్యూజిక్/వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో యా

ఎలా బుక్‌ చేసుకోవాలి...

బిక్విక్‌ కస్టమర్లు హోమ్‌ పేజీలో రీఛార్జ్‌ ఐకాన్‌ను ఎంపిక చేసుకోవాలి.
అనంతరం ''రీఛార్జ్‌ అండ్‌ బిల్‌ పేమెంట్‌'' కేటగిరీలో ఉన్న ఫోన్‌ బుకింగ్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేయాలి.
ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు జియోఫోన్‌ను ఎంపిక చేసుకోని, అవసరమైన వివరాలు నమోదుచేయాలి.

గతేడాది జూలైలో ..

గతేడాది జూలైలో రిలయన్స్‌ ఈ ఫోన్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 500 మిలియన్‌ మంది ఫీచర్‌ ఫోన్‌ యూజర్లకు డిజిటల్‌ లైఫ్‌ ఆఫర్‌ చేయడానికి ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. తెలుగుతోపాటు 22 ప్రాంతీయ భాషలకు ఈ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Now, you can buy JioPhone through mobile wallet MobiKwik: here's how more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot