6జీబి ర్యామ్, 128జీబి స్టోరేజ్ ఫోన్ రూ.21,499కే

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ నుబియా, తన Z17 Mini స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి లిమిటెడ్ ఎడిషన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి శక్తివంతమైన ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.21,499. అమెజాన్ ఇండియాలో నేటి నుంచి సేల్ ప్రారంభమవుతుంది.

Read More : రూ.11,999కే Yureka 2 : స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డ్యుయల్ కెమెరా సెటప్..

ఈ ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ డ్యుయల్ కెమెరా సెటప్. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాలు హై-క్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తాయి. ఈ కెమెరా మొత్తం 16 రకాల మోడ్స్ ను ఆఫర్ చేస్తుంది. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలను షూట్ చేసుకునే వీలుంటుంది.

Nubia Z17 Mini స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 653 చిప్‌సెట్, 6జీబి ర్యామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 2950mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ర్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.

ఆకట్టుకునే కెమెరా పనితీరు..

ఫోన్ వెనుక భాగంలో అమర్చిన రెండు 13 ఎంపీ కెమెరాలు పర్‌ఫెక్ట్ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తాయి. 4కే క్వాలిటీ వీడియోలను ఈ కెమెరాల ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ కెమెరా 80 డిగ్రీల్ వైడ్ వ్యూవింగ్ యాంగిల్‌తో బెస్ట్ క్వాలిటీ సెల్ఫీ ఇంకా వీడియో కాలింగ్‌ను ఆఫర్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nubia launches Limited Edition Z17 Mini with 6GB RAM, 128GB storage in India at Rs 21,499. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot