రూ.8,999కే Nubia M2 Play
5.5 ఇంచ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా...
జెడ్‌టీఈ సబ్సిడరీ బ్రాండ్ నుబియా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. Nubia M2 Play పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.8,999. Snapdragon 435 chipsetతో వస్తోన్న ఈ ఫోన్ Redmi 4కు ప్రధాన పోటీగా నిలవబోతోంది.

Amazon Indiaలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమయ్యే ఈ ఫోన్‌కు సంబంధించి సేల్ తేదీని త్వరలోనే అనౌన్స్ చేస్తారు. Nubia M2 Play స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720 పిక్సల్స్) విత్ 2.5డ కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ నుబియా 5.0 యూజర్ ఇంటర్‌ఫేస్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, అడ్రినో 505 జీపీయూ, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ విత్ వోల్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, గ్లోనాస్, మినీ యూఎస్బీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్).


Click it and Unblock the Notifications