ఇండియా మార్కెట్లోకి దూసుకొచ్చిన సరికొత్త గేమింగ్ ఫోన్ Nubia Red Magic
చైనాకి చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెలీకమ్యూనికేషన్ సంస్థ ZTE సరికొత్త స్మార్ట్ ఫోన్ Nubia Red Magic ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది .
చైనాకి చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెలీకమ్యూనికేషన్ సంస్థ ZTE సరికొత్త స్మార్ట్ ఫోన్ Nubia Red Magic ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది .ఈ ఫోన్ గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకొని ZTE కంపెనీ రూపొందించింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డీటీఎస్ ఆడియో, డెడికేటెడ్ గేమింగ్ బటన్ వంటి అదిరిపోయే ఫీచర్స్ ఈ గేమింగ్ ఫోన్‌లో ఉన్నాయి.

Nubia Red Magic
ధర రూ.29,999
ఫీచర్లు...
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 24, 8 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డీటీఎస్ ఆడియో, డెడికేటెడ్ గేమింగ్ బటన్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ZTE కంపెనీ లేటెస్ట్ గా రెండు ఫోన్లను చైనా మార్కెట్లో విడుదల చేసింది . ఒకసారి ఆ ఫోన్ల ఫీచర్లను పరిశిలిస్తే...
Nubia X ఫీచర్లు...
6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 5.1 ఇంచ్ సెకండరీ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, డ్యుయల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లు, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Nubia Red Magic Mars ఫీచర్లు...
6.0 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8/10 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై , డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా , ఫింగర్ ప్రింట్ సెన్సార్ , 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








