10జీబీ ర్యామ్ తో చైనా మార్కెట్లో లాంచ్ అయిన Nubia Red Magic Mars
చైనాకి చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెలీకమ్యూనికేషన్ సంస్థ ZTE సరికొత్త స్మార్ట్ ఫోన్ Nubia Red Magic Mars ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది.
చైనాకి చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెలీకమ్యూనికేషన్ సంస్థ ZTE సరికొత్త స్మార్ట్ ఫోన్ Nubia Red Magic Mars ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. గతంలో వచ్చిన Nubia Red Magic కీ కొనసాగింపు వెర్షన్ గా ఈ మొబైల్ మార్కెట్లోకి ను విడుదల చేసింది ZTE సంస్థ .ఈ ఫోన్ గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకొని ZTE కంపెనీ రూపొందించింది. ఈ ఫోన్ మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, లిక్విడ్ అండ్ ఎయిర్ కూలింగ్ సిస్టం, 4డీ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్, టచ్ సెన్సిటిట్ షోల్డర్ బటన్స్, డీటీఎస్ 7.1 ఛానల్ విత్ 3డీ సరౌండ్ సౌండ్ వంటి అదిరిపోయే ఫీచర్స్ ఈ గేమింగ్ ఫోన్‌లో ఉన్నాయి.

ధర...
మొదటి వేరియంట్ 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంది దీని సుమారు ధర రూ.27,400 గా ఉంది .
రెండ వేరియంట్ 6జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్ ధర సుమారు రూ.32,500గా ఉంది .
మూడవ వేరియంట్ 10జీబి ర్యామ్ + 256జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్ ధర రూ.40,600 గా ఉంది.

ఫీచర్లు...
6.0 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8/10 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై , డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా , ఫింగర్ ప్రింట్ సెన్సార్ , 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

గతంలో వచ్చిన Nubia Red Magic ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...
6.0 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 24 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా , ఫింగర్ ప్రింట్ సెన్సార్ , 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

లేటెస్ట్ గా ZTE కంపెనీ Nubia X ను విడుదల చేసింది. దాని ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి....
6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 5.1 ఇంచ్ సెకండరీ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, డ్యుయల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లు, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








