ఈ ఫోన్లపై రూ. 4 వేల వరకు తగ్గింపు
నూబియా ఫోన్లు డిస్కౌంట్ల వర్షం కురిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల కిందట భారీ తగ్గింపు పొందిన ఈ ఫోన్లు ఇప్పుడు మళ్లీ తగ్గాయి.
నూబియా ఫోన్లు డిస్కౌంట్ల వర్షం కురిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల కిందట భారీ తగ్గింపు పొందిన ఈ ఫోన్లు ఇప్పుడు మళ్లీ తగ్గాయి. ఒక్కో ఫోన్ రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు తగ్గింది. అమెజాన్ సమ్మర్ రష్ సేల్ సందర్భంగా ఈ ఆఫర్ పెట్టామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తగ్గిన ఫోన్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు 3 రోజుల పాటు
అమెజాన్ సైట్‌లో సమ్మర్ రష్ సేల్ ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు 3 రోజుల పాటు కొనసాగనుంది.

నూబియా ఎన్1 లైట్
సమ్మర్ రష్ సేల్‌లో భాగంగా నూబియా ఎన్1 లైట్ రూ.2వేలు తగ్గి రూ.5,999 ధరకు లభిస్తుంది.

నూబియా ఎం2 లైట్
నూబియా ఎం2 లైట్ ధర రూ.4వేల వరకు తగ్గింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.9,999 ధరకు లభిస్తున్నది.

నూబియా ఎన్2
అదేవిధంగా నూబియా ఎన్2 రూ.3వేలు తగ్గి రూ.12,999 ధరకు అమెజాన్ సైట్‌లో లభిస్తుంది.

నూబియా జడ్11
ఇక నూబియా జడ్11 రూ.4వేలు తగ్గి రూ.25,999 ధరకు లభిస్తోంది.


Click it and Unblock the Notifications








