డ్యుయల్ డిస్‌ప్లేతో చైనా మార్కెట్లో లాంచ్ అయిన Nubia X
చైనాకి చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెలీకమ్యూనికేషన్ సంస్థ ZTE ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సిరిస్ లో అదిరిపోయే ఫీచర్ తో Nubia Xను చైనా మార్కెట్ లోకి లాంచ్ చేసింది.
చైనాకి చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెలీకమ్యూనికేషన్ సంస్థ ZTE ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సిరిస్ లో అదిరిపోయే ఫీచర్ తో Nubia Xను చైనా మార్కెట్ లోకి లాంచ్ చేసింది. ఇప్పటిదాకా రిలీజైన అన్ని బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు దాదాపు సింగిల్ డిస్ ప్లే తోనే వస్తున్నాయి. అయితే నుబియా ఎక్స్ లో మాత్రం డ్యుయల్ డిస్ ప్లే ఉండటం విశేషం.ఈ Nubia X ఫోన్ యొక్క ఫీచర్ల విషయానికొస్తే...

Nubia X ఫీచర్లు...
6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 5.1 ఇంచ్ సెకండరీ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, డ్యుయల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్లు, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ధర...
Nubia X స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.34,960 ఉండగా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.39,195గా ఉంది. అలాగే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.44,490గా ఉంది. ఈ ఫోన్‌ను నవంబర్ 5వ తేదీ నుంచి విక్రయించనున్నారు.

డిస్‌ప్లే....
ఇందులో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 5.1 ఇంచుల సెకండరీ డిస్‌ప్లేను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. ఈ డిస్‌ప్లే ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లలా ఇందులో నాచ్ తరహా డిస్‌ప్లే లేదు.

వెనుక భాగంలో 16, 24 మెగాపిక్సల్ కెమెరాలు...
సెకండరీ డిస్‌ప్లే ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. అన్ని ఫోన్లలా ఈ ఫోన్ లో ఫ్రంట్ సెల్ఫీ కెమెరా లేదు. ఫోన్ వెనుక భాగంలో 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ కెమెరాలు ఉన్నాయి.

రెండు వైపులా ఫింగర్ ప్రింట్ సెన్సార్లు...
ఈ ఫోన్‌కు రెండు వైపులా ఫింగర్ ప్రింట్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. 3800 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను దీనికి అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications








