8జీబి ర్యామ్‌తో మొదటి స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది

ప్రపంచపు మొట్టమొదటి 8జీబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ZTE ఎలైట్ బ్రాండ్ అయిన Nubia నుంచి ఈ ఫోన్ విడుదలైంది. నుబియా జెడ్17 పేరుతో ఈ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. bezel-less డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 8జీబి ర్యామ్, వాటర్ ప్రూఫ్ బాడీ వంటి విప్లవాత్మక ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్ 5 కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు.. బ్లాక్, బ్లాక్ గోల్డ్, గోల్డ్, రెడ్, బ్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Nubia Z17 డిజైన్

మెటాలిక్ బ్యాక్ ప్యానల్‌తో వస్తోన్న ఈ ఫోన్‌కు రెడ్ సర్క్యులర్ కెపాసిటివ్ హోమ్ బటన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన డ్యుయల్ కెమెరా సెటప్ ఇంకా సింగిల్ స్లిట్ యాంటెనా డిజైన్ ప్రొఫెషనల్ లుక్‌ను కలిగిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెనుక భాగంలో చేతివేళ్లకు సులువుగా అందేవిధంగా సెటప్ చేసారు.

Nubia Z17 డిస్‌ప్లే

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి నుబియా జెడ్17 ఫోన్, bezel-less 5.5 అంగుళాల 1080 పిక్సల్ ప్యానల్‌తో వస్తోంది. ఈ డిస్‌ప్లే పై అమర్చిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ మరిత ప్రొటెక్షన్‌ను ఆఫర్ చేస్తుంది.

 

హార్డ్‌వేర్ స్పెక్స్

నుబియా జెడ్17 ఫోన్ శక్తివంతమైన హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. శక్తివంతమైన 2.4GHz ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ పై ఈ ఫోన్ అవుతుంది. ర్యామ్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ 8జీబి ఇంకా 6జీబి వేరియంట్‌లలో అందబాటులో ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 128జీబి ఇంకా 64జీబి వేరియంట్‌లలో ఈ ఫోన్ దొరుకుతుంది. మైక్రోఎస్డీ స్లాట్ సదుపాయం ఉండదు.

కెమెరా స్పెసిఫికేషన్‌

కెమెరా స్పెసిఫికేషన్‌ను పరిశీలించినట్లయితే ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 23 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్ ఇన్‌డెప్త్ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది. ఈ కెమెరాలో సెటప్ చేసిన నియోవిజన్ 7.0 సాఫ్ట్‌వేర్, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 10ఎక్స్ ఆప్టికల్ జూమ్ వంటి అంశాలు ఆకట్టుకుంటాయి. స్పెషల్ వై-ఫై కెమెరా ఫీచర్‌తో ఇతర స్మార్ట్‌ఫోన్‌లలోని కెమెరాలను ఈ ఫోన్ నుంచే కంట్రోల్‌ ఆపరేట్ చేసే వీలుంటుంది. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ కెమెరాతో హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. డాల్బీ అట్మోస్, హై-ఫై+, ఎన్ఎఫ్ సీ, బ్లుటూత్ 4.1, డ్యుయల్ బ్యాండ్ వై-ఫై వంటి అత్యాధునిక కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి

నుబియా జెడ్17 ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన Nubia UI 5.0 లేయర్ పై రన్ అవుతుంది.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

నుబియా జెడ్17 ఫోన్ 3200mAh బ్యాటరీతో వస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. 50శాతం బ్యాటరీ కేవలం 25 నిమిషాల్లో ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

 

జూన్ 6 నుంచి చైనా మార్కెట్లో

నుబియా జెడ్17 ఫోన్ జూన్ 6 నుంచి చైనా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. JD.com ద్వారా ఈ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. 8జీబి ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 587 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.37759). 6జీబి ర్యామ్ + 128 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 500 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.32163), 6జీబి ర్యామ్ + 64 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర 411 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.26438).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nubia Z17 launched: Specifications, pricing and more. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot