రూ.3000 తగ్గింపుతో Nubia Z17 Mini

Nubia బ్రాండ్ నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన Z17 Mini స్మార్ట్‌ఫోన్ రూ.3000 ధర తగ్గింపును అందుకుంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ.19,999గా ఉండగా ప్రస్తుత ధర రూ.16,999గా ఉంది. ఈ ఆఫర్ లిమిటెడ్ పిరియడ్ మాత్రమే. Z17 Mini స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా ట్రేడ్ అవుతోంది. బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

రూ.3000 తగ్గింపుతో Nubia Z17 Mini

Read More : సెప్టంబర్ 6న Lenovo K8 Plus?

Nubia Z17 Mini స్పెసిఫికేషన్స్.. 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం, 2950mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, నియర్ ఫీల్డ్ర్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.

English summary
Nubia Z17 Mini price slashed by Rs 3,000 for a limted period. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot