Home
Mobile

కెమెరా ఫోన్లలో కింగ్.. 35mm లెన్స్, 50X జూమ్‌తో Nubia Z70S అల్ట్రా.. ఏప్రిల్ 28న వస్తోంది..

Nubia Z70S Ultra Photographer Edition : టెక్నాలజీ, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ ఫొటోగ్రఫీని ఇష్టపడేవారికి నుబియా (Nubia) బ్రాండ్ ఒక అదిరిపోయే వార్త చెప్పింది. ఎప్పటినుంచో ఊరిస్తున్న నుబియా Z70S అల్ట్రా ఫొటోగ్రాఫర్ ఎడిషన్ (Nubia Z70S Ultra Photographer Edition) స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 28న చైనాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే లీకులు, టీజర్లతో ఈ ఫోన్‌పై విపరీతమైన ఆసక్తి నెలకొంది.

ప్రధానంగా కెమెరాపైనే దృష్టి సారించి తయారుచేసిన ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను 'నుబియా AI డ్యూయల్ ఫ్లాగ్‌షిప్ న్యూ ప్రొడక్ట్ లాంచ్' (Nubia AI Dual Flagship New Product Launch) అనే కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఇదే ఈవెంట్‌లో నుబియా తమ మొట్టమొదటి టాబ్లెట్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉందని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.

Nubia Z70S Ultra Photographer Edition Launching April 28

* డిజైన్ అదిరింది

ఈ నుబియా Z70S అల్ట్రా ఫోటోగ్రాఫర్ ఎడిషన్ డిజైన్ చూస్తేనే ఇది ప్రత్యేకంగా మొబైల్ ఫోటోగ్రఫీని సీరియస్‌గా తీసుకునే వారి కోసమే తయారైందని తెలిసిపోతుంది. పాత క్లాసిక్ కెమెరాలను గుర్తుకుతెచ్చేలా దీన్ని డిజైన్ చేశారు. ప్రధాన కెమెరా లెన్స్ చుట్టూ ఆకర్షణీయమైన ఎరుపు రంగు రింగ్ (Red-ring accent) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

అలాగే, దాని ఫోటోగ్రఫీ సామర్థ్యాన్ని తెలియజేస్తూ 'నియోవిజన్' (Neovision) అనే లేబుల్ కూడా ఇచ్చారు. ఫోన్ వెనుక భాగం అచ్చం లేత దూడ చర్మం (calfskin) లాంటి లెదర్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఇది ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇవ్వడమే కాకుండా, చేతిలో పట్టుకోవడానికి మంచి గ్రిప్‌ను కూడా అందిస్తుంది.

* కెమెరా సిస్టమ్

ఈ ఫోన్ కెమెరాలో నుబియా సరికొత్త టెక్నాలజీని వాడింది. ఇందులో ఐదవ తరం 35mm లెన్స్‌ను అమర్చారు. ఈ లెన్స్ పనితీరు, సైజులో షియోమీ 15 అల్ట్రా (Xiaomi 15 Ultra) వంటి ఫోన్లలో ఉండే 1-అంగుళాల సెన్సార్‌తో పోటీ పడుతుందని కంపెనీ చెబుతోంది. లెన్స్ వ్యాసం పెద్దదిగా ఉండి ఎక్కువ కాంతిని లోపలికి తీసుకుంటుంది.

ఫలితంగా, తక్కువ వెలుతురులోనూ ఫొటోల నాణ్యత అద్భుతంగా ఉంటుంది. లీకైన సమాచారం ప్రకారం, ఈ ఫోన్‌కు 400mm ఎక్స్‌టర్నల్ లెన్స్‌ను జతచేసుకునే సౌకర్యం, అచ్చం కెమెరాలా ఆపరేట్ చేయగలిగే కన్సోల్, అలాగే అవసరమైతే షట్టర్ బటన్, డయల్ వంటి అదనపు యాక్సెసరీలను కూడా వాడుకునే అవకాశం ఉంటుందట.

అంతేకాదు, ఈ ఫోన్ ఏకంగా 50X జూమ్‌ను సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. ఈ ఫోన్ మరో ముఖ్యమైన ఆకర్షణ దాని 1.5K రిజల్యూషన్‌తో వచ్చే 'ట్రూ ఫుల్-స్క్రీన్' డిస్‌ప్లే. ఈ సంవత్సరం మార్కెట్లోకి వస్తున్న 'అల్ట్రా' సిరీస్ ఫోన్లలో, ఫ్రంట్ అండర్-డిస్‌ప్లే కెమెరా (Under-Display Camera) టెక్నాలజీతో వస్తున్న ఏకైక మోడల్ ఇదేనని చెబుతున్నారు.

బ్లూ డైమండ్ పిక్సెల్ లేఅవుట్, FIAA కంప్రెషన్ వైరింగ్ వంటి టెక్నాలజీలతో స్క్రీన్ అంచులు దాదాపు కనిపించకుండా, ఎక్కువ స్క్రీన్ ఏరియాను అందిస్తున్నారు. స్క్రీన్ కింద ఉన్న కెమెరాతో ఫోటోలు తీసినా క్వాలిటీ తగ్గకుండా, అదే సమయంలో డిస్‌ప్లే ఎంతో షార్ప్‌గా కనిపించడానికి ప్రత్యేకంగా 'UDC అల్ట్రా' చిప్‌ను కూడా వాడారు.

* పనితీరులోనూ టాప్

కేవలం కెమెరా, డిజైన్ మాత్రమే కాదు, పనితీరు విషయంలోనూ ఈ ఫోన్ ఏమాత్రం తగ్గదు. ఇందులో అత్యంత శక్తివంతమైన లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite) చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారని అంచనా. ఇది ఫోన్‌కు సూపర్ ఫాస్ట్ స్పీడ్‌ను, అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

ఇటీవలే ఈ ఫోన్ NX737J అనే మోడల్ నంబర్‌తో MIIT సర్టిఫికేషన్ కూడా పొందింది. దీని డిజైన్, అంతకుముందు వచ్చిన నుబియా Z70 అల్ట్రా (Nubia Z70 Ultra) ను పోలి ఉండటంతో, స్క్రీన్ క్వాలిటీ, బ్యాటరీ, ఇతర హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లు కూడా దాదాపు Z70 అల్ట్రా మాదిరిగానే ఉండవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nubia Z70S Ultra Photographer Edition Launching April 28 Pro 35mm Lens, 50X Zoom Snapdragon 8 Elite
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X