ఇండియన్ మార్కెట్లోకి మరో అమెరికా కంపెనీ, ఒకేసారి 4 ఫోన్లతో..

Written By:

అమెరికాకు చెందిన నూ మొబైల్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకేసారి 4 4జీ ఫోన్లతో ఈ కంపెనీ ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి రంగ ప్రవేశం చేసింది. ఈ సంస్థ ఇప్పటికే అమెరికా, యూకే, ఇండోనేషియా దేశాల్లో తన స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్నది.

ఈ ఫోన్లకే ఆండ్రాయిడ్ 8.0 అప్‌డేట్, మీ ఫోన్ చెక్ చేయండి

ఇండియన్ మార్కెట్లోకి మరో అమెరికా కంపెనీ, ఒకేసారి 4 ఫోన్లతో..

'క్యూ500, క్యూ626, ఎం3, ఎక్స్5' పేరిట ఈ ఫోన్లు విడుదలయ్యాయి. ఈ ఫోన్ల ధరలు రూ.9,999, రూ.15,999 ల మధ్య ఉంటాయని నూ మొబైల్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ముందుగా ఈ ఫోన్ల గురించిన ప్రచార కార్యక్రమాలు చేపడుతామని త్వరలోనే వీటిని యూజర్లకు అందుబాటులోకి తెస్తామని వారు చెప్పారు.

లగ్జరీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది, ధర వింటే షాకే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నూ ఎక్స్5 ఫీచర్లు...

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 13, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 2950 ఎంఏహెచ్ బ్యాటరీ.

నూ ఎం3 ఫీచర్లు

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ.

నూ క్యూ626 ఫీచర్లు

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

నూ క్యూ500 ఫీచర్లు

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధరలు

ఈ ఫోన్ల ధరలు రూ.9,999, రూ.15,999 ల మధ్య ఉంటాయని నూ మొబైల్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nuu Mobile Enters India With X5, M3, Q626 and Q500 4G VoLTE Smartphones Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot