Just In
- 3 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 8 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 10 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ: మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌గా భారతి
- Lifestyle
తలనొప్పి మరియు డయాబెటిస్ కి మధ్య సంబంధం ఉందా? కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి
- Sports
పిచ్‌ది ఏముందన్నా.. మనలో దమ్ముండాలి: సూర్యకుమార్ యాదవ్
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Movies
Taraka Ratna Health: తారకరత్న సిటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు.. బ్రెయిన్లో అలాంటి సమస్య
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
అదిరిపోయే కలర్‌తో OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ భారత్‌లో విడుదల!
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ నుంచి సరికొత్త మొబైల్ భారత మార్కెట్లో విడుదలైంది. OnePlus 10R 5G Prime Blue Edition భారత మార్కెట్లో నేడు లాంచ్ అయింది. ఈ కొత్త మొబైల్ OnePlus కంపెనీ గత కొన్ని నెలల క్రితం ప్రారంభించిన OnePlus 10R 5G మాదిరి ఫీచర్లనే కలిగి ఉంది. కాకపోతే ఇది ప్రైమ్ బ్లూ ఎడిషన్ కలర్ వేరియంట్లో వస్తోంది. అయితే, కొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఆఫర్లతో కలుపుకుని రూ.29,499 కు పొందవచ్చని కంపెనీ ట్విటర్‌లో వెల్లడించింది. ఇది Amazonలో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

భారత మార్కెట్లో OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ ధర:
OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ 8GB RAM + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంది. దీన్ని ప్రస్తుతం ఆఫర్లతో కలుపుకుని రూ.29,499 కు పొందవచ్చని కంపెనీ ట్విటర్‌లో వెల్లడించింది. గతంలో విడుదలైన పాత వర్షన్ OnePlus 10R 5G గరిష్టంగా 12GB RAM మరియు 256GB స్టోరేజీతో అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022లో భాగంగా ఈ కొత్త ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది.
OnePlus 10R 5G Prime Blue Edition ఫీచర్లు:
OnePlus 10R 5G పాత వర్షన్ మొబైల్‌తో పోల్చినపుడు, OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ డిజైన్ మరియు కలర్ పరంగా మాత్రమే భిన్నంగా ఉంటుంది. మిగతా అంతా ఒకే మాదిరి ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది.

ఇక స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. కొత్తగా ప్రారంభించబడిన OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ FHD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 20:9 యాస్పెక్ట్ రేషియోను అందిస్తుంది. OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ 8GB RAM మరియు 128GB డిఫాల్ట్ స్టోరేజ్‌తో జత చేయబడిన MediaTek డైమెన్సిటీ 8100-MAX ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ మొబైల్ ఆక్సిజన్ ఓఎస్ కస్టమ్ స్కిన్‌తో ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో నడుస్తుంది.
ఇక కెమెరా విషయానికొస్తే.. OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ కు బ్యాక్‌సైడ్ 50MP సోనీ IMX766 ప్రైమరీ లెన్స్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్ అందించారు. ఇందులో 2MP మాక్రో షూటర్ మరియు 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉన్నాయి. అదనంగా, సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 16MP Sony IMX471 ఫ్రంట్ కెమెరా ఉంది.
OnePlus 10R 5G యొక్క ముఖ్య ఫీచర్లలో ఒకటి బ్యాటరీ. ఈ మొబైల్ 150W ఫాస్ట్ ఛార్జింగ్‌తో జత చేసిన 4,500 mAh బ్యాటరీని కలిగి ఉంది. దాంతో పాటుగా మరో మోడల్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. కొత్తగా ప్రారంభించిన OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ మోడల్‌ను మాత్రమే అందిస్తుంది. కానీ అమెజాన్ లిస్టింగ్‌లో మాత్రం 80W మోడల్‌ను మాత్రమే చూపిస్తుంది.

అదేవిధంగా, OnePlus నుంచి ఆగస్టులో విడుదలైన OnePlus 10T మొబైల్ గురించి కూడా ఓ లుక్కేద్దాం:
OnePlus 10T స్పెసిఫికేషన్లు, ఫీచర్లు:
ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD+ AMOLED డిస్‌ప్లే పానెల్, 120Hz రిఫ్రెష్ రేటుతో పని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Snapdragon 8+ Gen 1 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ IP53 వాటర్ లేదా డస్ట్ రెసిస్టాన్స్ రేటింగ్ ఫీచర్తో వస్తోంది. ఇది ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8GB, 12GB, 16GB of LPDDR5 RAM |128GB, 256GB of UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తోంది.
ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో Sony IMX766 సెన్సార్‌ను ప్రైమరీ కెమెరాగా అందిస్తున్నారు. వేగవంతమైన ఫొటో క్యాప్చర్ కోసం వనప్లస్ న్యూ ఇమేజ్ క్లారిటీ ఇంజిన్ (ఐసీఈ) సపోర్ట్ తో ఇస్తున్నారు. మెరుగైన HDR పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్ OnePlus యొక్క HDR 5.0 మరియు TurboRAW అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుందని కూడా పేర్కొంది. హీట్‌ను తగ్గించి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేలా వేపర్ కూలింగ్ సిస్టమ్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఇక ఛార్జ్ విషయానికొస్తే 4,800 mAh సామర్థ్యం గల బ్యాటరీ 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయల్ సిమ్ స్లాట్స్, రెండిటికీ 5జీ నెట్‌వర్క్ సపోర్ట్ సిస్టమ్ కలిగి ఉంది. ఇది బ్లాక్, గ్రీన్ కలర్ వేరియంట్లలో అందుబాటులోకి రానున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. OnePlus ప్రకారం, స్మార్ట్‌ఫోన్ 360-డిగ్రీ యాంటెన్నా సిస్టమ్ మరియు స్మార్ట్ లింక్‌ను కూడా పొందుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470