Home
Mobile

మ‌రో రెండ్రోజుల్లో OnePlus 10T విడుద‌ల‌.. షాకిచ్చేలా కెమెరా లెన్స్‌!

OnePlus నుంచి మ‌రో రెండు రోజుల్లో స‌రికొత్త శ‌క్తివంత‌మైన 5జీ మొబైల్ విడుద‌ల కానుంది. OnePlus 10T 5G పేరుతో ఈ కొత్త మోడ‌ల్ మొబైల్ గ్లోబ‌ల్‌గా ప‌లు ఎంపిక చేసిన మార్కెట్ల‌లో విడుద‌ల కానుంది. OnePlus కంపెనీ ఇప్ప‌టికే గ‌త కొన్ని రోజులుగా ఈ డివైజ్ కు సంబంధించిన ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించింది. కానీ, మార్కెట్లో వీటి ల‌భ్య‌త గురించి ఎలాంటి స‌మాచారం లేదు. కానీ, విడుద‌లైన త‌ర్వాత అతి త్వ‌ర‌లోనే ఇవి కొనుగోలుకు అందుబాటులోకి వ‌చ్చే అవకాశం ఉంది.

OnePlus 10T 5G

ఒక‌వేళ ఈ డివైజ్ విడుద‌ల అయిన త‌ర్వాత మీరు దీన్ని కొనుగోలు చేయాల‌నుకుంటే.. ఈ మొబైల్‌కు సంబంధించిన విశేషాల‌ను మీరు తెలుసుకోవాలి. అందుకోసం మేం ఈ OnePlus 10T 5G డివైజ్‌కు సంబంధించిన ప్ర‌తి వివ‌రాల‌ను మీ కోసం అందిస్తున్నాం. దీనిపై ఓ లుక్కేయండి.

OnePlus 10T 5G గురించి ఎక్స్‌పెక్టెడ్‌ స్పెసిఫికేష‌న్ వివ‌రాలు:
ఈ మోడ‌ల్‌కు సంబంధించి ఇటీవ‌ల లీకైన స్పెసిఫిష‌న్ల‌ను చూస్తే.. ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD + Fluid AMOLED డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్య‌ధికంగా 120Hz రిఫ్రెష్ రేటును క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8+ Gen1 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ IP53 వాట‌ర్ లేదా డ‌స్ట్ రెసిస్టాన్స్ రేటింగ్‌ ఫీచ‌ర్తో వ‌స్తోంది. ఇది ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భిస్తోంది. 16GB of LPDDR5 RAM |512GB of UFS 3.1 ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ OnePlus 10T మొబైల్‌కు ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను అందిస్తున్నారు. 50-megapixel క్వాలిటీలో Sony IMX766 సెన్సార్‌ను ప్రైమ‌రీ కెమెరాగా అందిస్తున్నారు. వేగ‌వంత‌మైన‌ ఫొటో క్యాప్చ‌ర్ కోసం OnePlus న్యూ ఇమేజ్ క్లారిటీ ఇంజిన్ (ఐసీఈ) స‌పోర్ట్ సిస్టం ఇస్తున్నారు. ఈ మేర‌కు కంపెనీ గ‌తంలో క‌మ్యూనిటీ పోస్ట్‌లో వెల్ల‌డించింది. మెరుగైన HDR పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్ OnePlus యొక్క HDR 5.0 మరియు TurboRAW అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుందని కూడా పేర్కొంది. బ్యాక్‌సైడ్ మ‌రో రెండు కెమెరాల్లో ఒక‌టి 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ లెన్స్‌, ఇంకోటి 2 మెగాపిక్సెల్ క్వాలిటీతో మాక్రో సెన్సార్ క‌లిగి ఉంటుంది. ఇక, సెల్ఫీ మ‌రియు వీడియోకాలింగ్ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీ లెన్స్ అందిస్తున్నారు.

OnePlus 10T 5G

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4800mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. 150W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్టును క‌లిగి ఉంది. కనెక్టివిటీ పరంగా, డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, 5G ​​సపోర్ట్, Wi-Fi, USB టైప్-C పోర్ట్ స‌హా ప‌లు ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉండ‌నుంద‌ని తెలుస్తోంది.

OnePlus 10T 5G ధ‌ర‌:
OnePlus 10T 5G స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధ‌ర రూ.49,999 గా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. ఇక 16జీబీ ర్యామ్ క‌లిగిన టాప్ వేరియంట్ రూ.60,000 వ‌ర‌కు ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రో రెండు రోజుల్లో ఈ మొబైల్ విడుద‌ల అయ్యాక అధికారికంగా ధ‌ర‌ల వివ‌రాలు వెల్ల‌డ‌వుతాయి.

OnePlus 10T 5G

OnePlus నుంచి ఇటీవ‌ల భార‌త్‌లో విడుద‌లైన OnePlus Nord 2T ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల పై ఓ సారి లుక్కేద్దాం:
ఈ OnePlus Nord 2T మొబైల్ కొత్త Dimensity 1300 ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. మార్కెట్‌లో సరికొత్త ప్రాసెసర్‌ని అందుకున్న మొదటి ఫోన్‌గా ఇది నిలిచింది. ఈ మొబైల్‌కు 12GB RAM| 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీని అందిస్తున్నారు. ఈ మొబైల్ ఉప‌యోగించ‌డం ద్వారా యూజ‌ర్లు అద్భుత‌మైన అనుభూతిని పొందుతారు. ఈ మొబైల్ Oxygen OS 12.1 ఆధారిత ఆండ్రాయిడ్ 12 OS పై ప‌నిచేస్తుంది. లోడెడ్ బ్లోట్‌వేర్‌తో సంబంధం లేకుండా మీ మొబైల్ తాజా ఫీచ‌ర్లు, అప్‌గ్రేడ్‌ల‌ను క‌లిగి ఉండేలా చూస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

OnePlus Nord 2T 5G స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్-కెమెరా సెటప్ క‌లిగి ఉంది. OnePlus 10R ఫ్లాగ్‌షిప్ మొబైల్‌లో మాదిరిగా.. ఈ ఫోన్‌కు 50MP క్వాలిటీతో ఓఐఎస్ స‌పోర్ట్ క‌లిగిన Sony IMX766 ప్రైమ‌రీ లెన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 MP క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. దాంతో పాటుగా ప‌లు అద‌న‌పు ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. ఈ మొబైల్ మెరుగైన ఏఐ ఆధారిత వీడియో, స్లో మోష‌న్ వీడియో, డ్యుయ‌ల్ వ్యూ వీడియో, హెచ్‌డీఆర్‌, నైట్‌స్కేప్ మోడ్‌, పోట్ర‌యిట్ మోడ్‌, ప‌నోర‌మ‌, రిటచింగ్‌, ఫిల్ట‌ర్స్ స‌హా మొద‌ల‌గు ఫీచ‌ర్ల‌తో విడుద‌లైంది. కెమెరా ప‌రంగా ఈ ఫోన్‌కు మ‌రొక‌టి సాటి లేదు అన్న‌విధంగా రూపొందించారు.

రెండు వేరియంట్ల‌లో:
భార‌త్‌లో ఈ మొబైల్ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భించ‌నుంది. తొలి వేరియంట్ 8GB RAM + 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. దీని ప్రారంభ ధ‌ర రూ.28,999 వ‌ర‌కు నిర్ణ‌యించారు. మ‌రో వేరియంట్ 12GB RAM + 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ క‌లిగి ఉంటుంది. దీని ప్రారంభ ధ‌ర రూ.33,999 వ‌ర‌కు నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం అమెజాన్‌లో ఈ మొబైల్స్ కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 10T 5G is Going to Launch in 2 Days, What to Expect
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X