OnePlus 10T 5G స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌.. ధ‌ర‌లు, ఫీచ‌ర్లు చూడండి!

|

ప్ర‌ముఖ మొబైల్స్ త‌యారీ సంస్థ OnePlus నుంచి టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న OnePlus 10T 5G ఫోన్ ఎట్ట‌కేల‌కు వ‌చ్చేసింది. భార‌త్ స‌హా, అంత‌ర్జాతీయ‌ మార్కెట్లో OnePlus 10T 5G మొబైల్‌ను ఆ కంపెనీ బుధ‌వారం విడుద‌ల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌ను వన్‌ప్లస్ కంపెనీ న్యూయార్క్ సిటీ లాంచ్ ఈవెంట్‌లో ఆవిష్క‌రించింది. ఆడియెన్స్ వీక్షించ‌డం కోసం ఈ ఈవెంట్ ను OnePlus అధికారిక యూట్యూబ్ ఛానెల్ మరియు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేశారు.

OnePlus 10T 5G

ఇప్ప‌టికే, ఈ OnePlus 10T 5G మొబైల్‌కు సంబంధించి ప‌లు ప్ర‌త్యేక ఫీచ‌ర్ల‌ను కంపెనీ కొన్ని సంద‌ర్భాల్లో వెల్ల‌డించింది. కాగా, ఇప్పుడు అధికారికంగా మొబైల్‌ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల‌ను క‌లిగి ఉంది. 50-megapixel క్వాలిటీలో Sony IMX766 సెన్సార్‌ను దీనికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. వేగ‌వంత‌మైన‌ ఫొటో క్యాప్చ‌ర్ కోసం OnePlus న్యూ ఇమేజ్ క్లారిటీ ఇంజిన్ (ఐసీఈ) స‌పోర్ట్ సిస్టం ఇస్తున్నారు. అంతేకాకుండా, 4,800mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని క‌లిగి ఉంది.

OnePlus 10T 5G

OnePlus 10T స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు:
ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD+ AMOLED డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Snapdragon 8+ Gen 1 SoC ప్రాసెస‌ర్‌పై ర‌న్ అవుతుంది. ఈ మొబైల్ IP53 వాట‌ర్ లేదా డ‌స్ట్ రెసిస్టాన్స్ రేటింగ్‌ ఫీచ‌ర్తో వ‌స్తోంది. ఇది ర్యామ్ కెపాసిటీ ఆధారంగా మూడు వేరియంట్ల‌లో ల‌భిస్తోంది. 8GB, 12GB, 16GB of LPDDR5 RAM |128GB, 256GB of UFS 3.1 ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ల‌లో ల‌భిస్తోంది. దీనికి హైప‌ర్ బూస్ట్ గేమింగ్ ఇంజిన్ అందిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ప‌నిచేస్తుంది.

OnePlus 10T 5G

ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధాన కెమెరా 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో Sony IMX766 సెన్సార్‌ను ప్రైమ‌రీ కెమెరాగా అందిస్తున్నారు. వేగ‌వంత‌మైన‌ ఫొటో క్యాప్చ‌ర్ కోసం వ‌న‌ప్ల‌స్ న్యూ ఇమేజ్ క్లారిటీ ఇంజిన్ (ఐసీఈ) స‌పోర్ట్ తో ఇస్తున్నారు. మెరుగైన HDR పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్ OnePlus యొక్క HDR 5.0 మరియు TurboRAW అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుందని కూడా పేర్కొంది. హీట్‌ను త‌గ్గించి మంచి ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చేలా వేప‌ర్ కూలింగ్ సిస్ట‌మ్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్ల‌డించింది.

OnePlus 10T 5G

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4,800 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ 150W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. ఇది బ్లాక్‌, గ్రీన్ క‌ల‌ర్ వేరియంట్ల‌లో అందుబాటులోకి రానున్న‌ట్లు ఓ నివేదిక వెల్ల‌డించింది. OnePlus ప్రకారం, స్మార్ట్‌ఫోన్ 360-డిగ్రీ యాంటెన్నా సిస్టమ్ మరియు స్మార్ట్ లింక్‌ను కూడా పొందుతుంది.

OnePlus 10T 5G ధర:
భార‌త మార్కెట్లో ఈ OnePlus 10T 5G మొబైల్ 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.49,999 గా నిర్ణయించారు. ఇక‌పోతే, 12GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.54,999 గా నిర్ణయించారు. 16GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.55,999 గా నిర్ణయించారు. ఆగ‌స్టు 6 వ తేదీ నుంచి ఇవి సేల్‌కు రాను్న‌ట్లు కంపెనీ పేర్కొంది. ఈ మొబైల్స్ జేడ్ గ్రీన్‌, మూన్ స్టోన్ బ్లాక్ క‌ల‌ర్ల‌లో అందుబాటులోకి రానున్నాయి.

Best Mobiles in India

English summary
Oneplus 10t 5G Smartphone launched, look at this fearures and specifications.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X