Home
Mobile

OnePlus 10T 5G వ‌ర్సెస్ Oppo Reno8 Pro 5G.. రెండు ఫ్లాగ్‌షిప్స్‌లో ఏది బెస్ట్‌!

OnePlus కంపెనీ నుంచి టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన OnePlus 10T 5G ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ గ‌త వారం ఎట్ట‌కేల‌కు విడుద‌లైంది. ఈ స్మార్ట్ ఫోన్ Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెస‌ర్, ట్రిపుల్ కెమెరా సెట‌ప్ స‌హా ప‌లు మ‌రిన్ని అద్భుత ఫీచ‌ర్లు ఉన్నాయి. కాగా, ఇప్ప‌టికే మ‌రో చైనా బ్రాండ్ ఒప్పో నుంచి కూడా గ‌త నెల‌లో Oppo Reno8 Pro 5G ఫ్లాగ్‌షిప్ కూడా విడుద‌లైంది.

oppo reno 8 pro

రెండు ప్ర‌ముఖ బ్రాండ్ల నుంచి ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి విడుద‌ల‌య్యాయి. ఆ రెండింటిలో ఏ మొబైల్ ప్ర‌త్యేక‌త ఏంటి.. ఒక‌దానితో మ‌రొక‌టి పోల్చిన‌పుడు ఎలాంటి తేడాలు ఉన్నాయి.. వాటి ధ‌ర‌ల్లో వ్య‌త్యాసం ఎలా ఉంది అనే విష‌యాల్ని వివ‌రంగా తెలుసుకుందాం.

ONEPLUS 10T 5G Vs Oppo Reno8 Pro 5G ధ‌ర‌లు:
* ధ‌ర‌ల విష‌యానికొస్తే.. భార‌త మార్కెట్లో ఈ OnePlus 10T 5G మొబైల్ 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.49,999 గా నిర్ణయించారు. ఇక‌పోతే, 12GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.54,999 గా నిర్ణయించారు. 16GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.55,999 గా నిర్ణయించారు. ఈ మొబైల్స్ జేడ్ గ్రీన్‌, మూన్ స్టోన్ బ్లాక్ క‌ల‌ర్ల‌లో అందుబాటులోకి రానున్నాయి.

* భారతదేశంలోని మార్కెట్లో Oppo Reno 8 Pro మొబైల్‌ 12GB RAM + 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ ధ‌ర‌ను రూ.45,999గా నిర్ణ‌యించారు. ఈ మొబైల్స్ అమెజాన్‌లో గ్లేజ్‌డ్ బ్లాక్‌, గ్లేజ్‌డ్ గ్రీన్ క‌ల‌ర్ల‌లో ప్ర‌స్తుతం కొనుగోలు దారుల‌కు అందుబాటులో ఉన్నాయి.

oppo reno 8 pro

ONEPLUS 10T 5G స్పెసిఫికేష‌న్లు:
* ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD+ AMOLED డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Snapdragon 8+ Gen 1 SoC ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మొబైల్ IP53 వాట‌ర్ లేదా డ‌స్ట్ రెసిస్టాన్స్ రేటింగ్‌ ఫీచ‌ర్తో వ‌స్తోంది. ఇది ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భిస్తోంది. 8GB, 12GB, 16GB of LPDDR5 RAM |128GB, 256GB of UFS 3.1 ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ల‌లో ల‌భిస్తోంది.

* ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధాన కెమెరా 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో Sony IMX766 సెన్సార్‌ను ప్రైమ‌రీ కెమెరాగా అందిస్తున్నారు. వేగ‌వంత‌మైన‌ ఫొటో క్యాప్చ‌ర్ కోసం వ‌న‌ప్ల‌స్ న్యూ ఇమేజ్ క్లారిటీ ఇంజిన్ (ఐసీఈ) స‌పోర్ట్ తో ఇస్తున్నారు. మెరుగైన HDR పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్ OnePlus యొక్క HDR 5.0 మరియు TurboRAW అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుందని కూడా పేర్కొంది. హీట్‌ను త‌గ్గించి మంచి ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చేలా వేప‌ర్ కూలింగ్ సిస్ట‌మ్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్ల‌డించింది.

oppo reno 8 pro

* ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4,800 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ 150W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. ఇది బ్లాక్‌, గ్రీన్ క‌ల‌ర్ వేరియంట్ల‌లో అందుబాటులోకి రానున్న‌ట్లు ఓ నివేదిక వెల్ల‌డించింది. OnePlus ప్రకారం, స్మార్ట్‌ఫోన్ 360-డిగ్రీ యాంటెన్నా సిస్టమ్ మరియు స్మార్ట్ లింక్‌ను కూడా పొందుతుంది.

oppo reno 8 pro

Oppo Reno8 Pro 5G స్పెసిఫికేష‌న్లు:
* Oppo Reno8 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. Oppo Reno 8 Pro మొబైల్‌ MediaTek Dimensity 8100 (or 8100 Max) ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వ‌ర్శ‌న్‌ పై ప‌ని చేస్తుంది. మొబైల్ కు 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+AMOLED డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పని చేస్తుంది. ఈ మొబైల్ Mediatek's Dimensity 8100 మోడ‌ల్ చిప్ సెట్ క‌లిగి ఉంది. ఈ మొబైల్ ర్యామ్ సామ‌ర్థ్యం ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ఉంది. వాటిలో 8GB RAM + 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో ఒక వేరియంట్ వ‌స్తుండ‌గా, 12GB RAM + 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో మ‌రో వేరియంట్ క‌లిగి ఉంది. దీనికి MediaTek Dimensity 8100-Max (5 nm) ప్రాసెస‌ర్ అందిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌ని చేస్తుంది.

* Oppo Reno 8 Pro మొబైల్ కు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సౌక‌ర్యాన్ని క‌లిగి ఉంది. 50 మెగా పిక్స‌ల్ క్వాలిటీతో 50MP Sony IMX766 sensor ప్ర‌ధాన కెమెరా ను క‌లిగి ఉంది. అంతేకాకుండా 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో వైడ్ యాంగిల్ లెన్స్‌, 2 మెగా పిక్సెల్ క్వాలిటీతో మాక్రో షూట‌ర్ లెన్స్ క‌లిగి ఉంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్స‌ల్ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. ఈ మొబైల్ 180 గ్రాముల బ‌రువు క‌లిగి ఉంది. ఈ మొబైల్ గీక్‌బెంచ్ ద్వారా బెంచ్‌మార్క్ చేయ‌బ‌డింది.

Best Mobiles in India

English summary
OnePlus 10T 5G Vs Oppo Reno8 Pro 5G: Which Makes A Better Camera Phone?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X