OnePlus 10T స్మార్ట్‌ఫోన్ కెమెరా క్వాలిటీ వివ‌రాలు తెలిస్తే షాకే!

|

ప్ర‌ముఖ మొబైల్ ఉత్ప‌త్తుల త‌యారీ కంపెనీ OnePlus గ్లోబ‌ల్ మార్కెట్లో త‌మ ఉత్పత్తుల్ని క్ర‌మంగా విస్త‌రిస్తోంది. రాబోయే ఆగ‌స్టు 3వ తేదీన‌, త‌మ కంపెనీ నుంచి OnePlus 10T పేరుతో మ‌రో కొత్త మోడ‌ల్ మొబైల్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కాగా, తాజాగా ఈ కొత్త మోడ‌ల్ యొక్క కెమెరా స్పెసిఫికేష‌న్ల‌ను కంపెనీ వెల్లడించింది.

 
OnePlus 10T స్మార్ట్‌ఫోన్ కెమెరా క్వాలిటీ వివ‌రాలు తెలిస్తే షాకే!

ఈ OnePlus 10T మొబైల్‌కు ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను అందిస్తున్న‌ట్లు స‌మాచారం. 50-megapixel క్వాలిటీలో Sony IMX766 సెన్సార్‌ను ప్రైమ‌రీ కెమెరాగా అందిస్తున్నారు. వేగ‌వంత‌మైన‌ ఫొటో క్యాప్చ‌ర్ కోసం OnePlus న్యూ ఇమేజ్ క్లారిటీ ఇంజిన్ (ఐసీఈ) స‌పోర్ట్ సిస్టం ఇస్తున్నారు. ఈ మేర‌కు కంపెనీ క‌మ్యూనిటీ పోస్ట్‌లో వెల్ల‌డించింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఎక్స్‌పెక్టెడ్‌ ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల‌ను చూద్దాం.

OnePlus 10T ఎక్స్‌పెక్టెడ్‌ స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.7 అంగుళాల full-HD+ AMOLED డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Snapdragon 8+ Gen 1 SoC ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మొబైల్ IP53 వాట‌ర్ లేదా డ‌స్ట్ రెసిస్టాన్స్ రేటింగ్‌ ఫీచ‌ర్తో వ‌స్తోంది. ఇది ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భిస్తోంది. 16GB of LPDDR5 RAM |512GB of UFS 3.1 ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది.

OnePlus 10T స్మార్ట్‌ఫోన్ కెమెరా క్వాలిటీ వివ‌రాలు తెలిస్తే షాకే!

ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాన కెమెరా 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో Sony IMX766 సెన్సార్‌ను ప్రైమ‌రీ కెమెరాగా అందిస్తున్నారు. వేగ‌వంత‌మైన‌ ఫొటో క్యాప్చ‌ర్ కోసం వ‌న‌ప్ల‌స్ న్యూ ఇమేజ్ క్లారిటీ ఇంజిన్ (ఐసీఈ) స‌పోర్ట్ తో ఇస్తున్నారు. మెరుగైన HDR పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్ OnePlus యొక్క HDR 5.0 మరియు TurboRAW అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుందని కూడా పేర్కొంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4800 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ 150W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. ఇది బ్లాక్‌, గ్రీన్ క‌ల‌ర్ వేరియంట్ల‌లో అందుబాటులోకి రానున్న‌ట్లు ఓ నివేదిక వెల్ల‌డించింది. OnePlus 10T ఆగష్టు 3 న న్యూయార్క్ నగరంలో జరిగే కార్యక్రమంలో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు కంపెనీ పేర్కొంది.

OnePlus 10T స్మార్ట్‌ఫోన్ కెమెరా క్వాలిటీ వివ‌రాలు తెలిస్తే షాకే!

OnePlus నుంచి ఇటీవ‌ల భార‌త్‌లో విడుద‌లైన OnePlus Nord 2T ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల పై ఓ సారి లుక్కేద్దాం:
ఈ OnePlus Nord 2T మొబైల్ కొత్త Dimensity 1300 ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. మార్కెట్‌లో సరికొత్త ప్రాసెసర్‌ని అందుకున్న మొదటి ఫోన్‌గా ఇది నిలిచింది. ఈ మొబైల్‌కు 12GB RAM| 256GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీని అందిస్తున్నారు. ఈ మొబైల్ ఉప‌యోగించ‌డం ద్వారా యూజ‌ర్లు అద్భుత‌మైన అనుభూతిని పొందుతారు. ఈ మొబైల్ Oxygen OS 12.1 ఆధారిత ఆండ్రాయిడ్ 12 OS పై ప‌నిచేస్తుంది. లోడెడ్ బ్లోట్‌వేర్‌తో సంబంధం లేకుండా మీ మొబైల్ తాజా ఫీచ‌ర్లు, అప్‌గ్రేడ్‌ల‌ను క‌లిగి ఉండేలా చూస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది.

 

OnePlus Nord 2T 5G స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్-కెమెరా సెటప్ క‌లిగి ఉంది. OnePlus 10R ఫ్లాగ్‌షిప్ మొబైల్‌లో మాదిరిగా.. ఈ ఫోన్‌కు 50MP క్వాలిటీతో ఓఐఎస్ స‌పోర్ట్ క‌లిగిన Sony IMX766 ప్రైమ‌రీ లెన్స్ ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 MP క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. దాంతో పాటుగా ప‌లు అద‌న‌పు ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తున్నారు. ఈ మొబైల్ మెరుగైన ఏఐ ఆధారిత వీడియో, స్లో మోష‌న్ వీడియో, డ్యుయ‌ల్ వ్యూ వీడియో, హెచ్‌డీఆర్‌, నైట్‌స్కేప్ మోడ్‌, పోట్ర‌యిట్ మోడ్‌, ప‌నోర‌మ‌, రిటచింగ్‌, ఫిల్ట‌ర్స్ స‌హా మొద‌ల‌గు ఫీచ‌ర్ల‌తో విడుద‌లైంది. కెమెరా ప‌రంగా ఈ ఫోన్‌కు మ‌రొక‌టి సాటి లేదు అన్న‌విధంగా రూపొందించారు.

Best Mobiles in India

English summary
OnePlus 10T Camera Specifications Confirmed, to Get a 50-Megapixel Primary Sensor

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X