Home
Mobile

వన్‌ప్లస్‌ 11 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌..6.7 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా సహా కీలక స్పెసిఫికేషన్లు..!

వన్‌ప్లస్‌ 11 5G స్మార్ట్‌ఫోన్‌ గత సంవత్సరం ఫిబ్రవరిలో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్‌ ప్రారంభ ధర రూ.56,999 గా ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ను అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ధరకు (Oneplus 11 5G Smartphone Price Drop) కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఉచితంగా వన్‌ప్లస్ బడ్స్‌ను పొందవచ్చు. పూర్తి వివరాలు.

అమెజాన్‌లో ప్రస్తుతం వన్‌ప్లస్‌ 11 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.42,999 కు కొనుగోలు చేయవచ్చు. అయితే కేవలం ఎటర్నల్‌ గ్రీన్ కలర్‌ వేరియంట్‌ మాత్రమే ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. టైటాన్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్ ప్రారంభ ధర రూ.45,999 గా ఉంది.

Oneplus 11 5G smartphone price drop on amazon

దీంతోపాటు అమెజాన్ ఆధారంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.3000 తగ్గింపును పొందవచ్చు. మరియు అమెజాన్‌లో దర్శిత ఎలక్ట్రానిక్స్‌ ద్వారా కొనుగోలు చేస్తే వన్‌ప్లస్‌ బడ్స్‌ Z2 ను ఉచితంగా పొందవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన హ్యాండ్‌సెట్స్‌ను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.31,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.

వన్‌ప్లస్‌ 11 5G స్మార్ట్‌vఫోన్ స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్‌ 11 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల సూపర్‌ ప్లూయడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను కలిగి ఉంటుంది.

ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత Oxygen OS 13 పైన పనిచేస్తుంది. మరియు స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ Adreno 740 GPU పైన పనిచేస్తుంది. 100W సూపర్‌వూక్ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP కెమెరా + 48MP అల్ట్రావైడ్‌ కెమెరా సహా 32MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలతో 60fps తో 4K నాణ్యత కలిగిన వీడియోలను రికార్డు చేయవచ్చు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ 16MP కెమెరాలను కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా ఈ వన్‌ప్లస్‌ 11 5G స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్‌ 5.3, వైఫై 7, NFC, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. మరియు డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్ స్పీకర్లతో అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్‌ సమ్మర్‌ లాంచ్ ఈవెంట్ జులై 16న ఇటలీలోని మిలాన్‌లో జరగనుంది. ఈ ఈవెంట్‌లోనే మొత్తం నాలుగు ఉత్పత్తులను సంస్థ విడుదల చేయనుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 5G, వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 2, వన్‌ప్లస్‌ వాచ్‌ 2R, వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 3 ప్రో ఈ సమ్మర్‌ ఈవెంట్‌లో లాంచ్‌ కానున్నాయి. వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 2.. వన్‌ప్యాడ్‌ ప్రో ట్యాబ్లెట్‌కు రీబ్యాడ్జ్‌ వెర్షన్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 11 5G smartphone gets best discount offer on amazon full sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X