16GB ర్యామ్, 50MP కెమెరా, 256GB స్టోరేజీ వన్‌ప్లస్ 11 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ల తయారీ సంస్థ వన్‌ప్లస్ గత సంవత్సరం ఫిబ్రవరిలో వన్‌ప్లస్ 11 5G హ్యాండ్‌సెట్ ను (Oneplus 11 5G smartphone Price drop) విడుదల చేసింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ ను భారీ తగ్గింపు ధరకు అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. రూ.40,000 ధర రేంజ్ లో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ వన్‌ప్లస్ 11 ను స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, ధర వివరాలను తెలుసుకోండి. ఈ హ్యాండ్‌సెట్ 100W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్టు సహా 50MP సోనీ కెమెరాలను కలిగి ఉంటుంది.
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ లో వన్‌ప్లస్ 11 5G స్మా్ర్ట్‌ఫోన్ 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.38,999 కే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఎటర్‌నల్ గ్రీన్ కలర్ స్మార్ట్‌ఫోన్ మాత్రేమే ఈ ధరకు అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.31,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

వన్‌ప్లస్ 11 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్ 11 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల సూపర్ ప్లూయడ్ అమోలెడ్ డిస్‌ప్లే ను కలిగి ఉంది. 3210*1440 పిక్సల్స్ రిజల్యూషన్, 120Hz రీఫ్రెష్ రేట్ తో అందుబాటులో ఉంది. HDR 10+ ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంది.
వన్‌ప్లస్ 11 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 మొబైల్ ప్లాట్‌ఫాం పైన పనిచేస్తుంది. Adreno 740 GPU చిప్‌సెట్, 16GB LPDDR5X ర్యామ్, 256GB UFS 4.0 స్టోరేజీతో జతచేయబడుతుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత Oxygen OS 13 ను కలిగి ఉంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌తో 50MP సోనీ IMX890 కెమెరా, 48MP సోనీ IMX581 అల్ట్రావైడ్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో 32MP సోనీ IMX709 టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాతో అందుబాటులో ఉంది.
ఈ వన్‌ప్లస్ హ్యాండ్‌సెట్ 100W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరియు కనెక్టివిటీ పరంగా బ్లూటూత్ 5.3, Wi-Fi 7, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. దీంతోపాటు భద్రత కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో అందుబాటులో ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








