Home
Mobile

Hasselblad బ్రాండింగ్ కు న్యాయం చేసిన వన్ ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్!

By Maheswara
OnePlus 11 Does Justice to the Hasselblad Branding: Here’s Why

ఈ నెల ప్రారంభంలో, గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ అయిన వన్ ప్లస్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న క్లౌడ్ 11 ఈవెంట్‌లో, అభిమానుల మధ్య వన్ ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ కొత్త బడ్జెట్ ఆధారిత ఫ్లాగ్‌షిప్ కొత్త వన్ ప్లస్ ప్యాడ్, బడ్స్ ప్రో 2 మరియు వన్ ప్లస్ 11R 5G ఫోన్ కూడా వేదికను పంచుకుంది. ఈ కొత్త వన్ ప్లస్ ఫోన్ శాంసంగ్ యొక్క కొత్త గెలాక్సీ S23 సిరీస్ మరియు iQOO 11 5G వంటి ఇతర ప్రధాన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడుతుంది. ముఖ్యంగా కెమెరా విభాగం లో ఈ పోటీ అధికంగా ఉంటుంది.

వన్ ప్లస్ 11 5G గొప్ప ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా రూపొందించబడింది. ఇది శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC తో వస్తుంది. అది ఏ ఇతర స్మార్ట్‌ఫోన్‌తో పోల్చలేని పనితీరును అందిస్తుంది. ముఖ్యంగా, వన్ ప్లస్ 16GB వేగవంతమైన LPDDR5X RAM మరియు 256GB UFS 4.0 స్టోరేజ్‌తో అద్భుతమైన SoCని కలిగి ఉండటం వల్ల, గేమ్‌లు లోడ్ అయ్యే వరకు ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు, అలాగే వెబ్ సర్ఫింగ్ మరియు ఇమేజ్ ఎడిటింగ్ వంటి రోజువారీ పనులు కూడా సులువుగా ఉంటాయి. ఈ ఫోన్లో భారీ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో తొందరగా రీఛార్జి కూడా చేసుకోవచ్చు.

వన్ ప్లస్ 11 5G ఫోన్ 6.7-అంగుళాల QHD+ LTPO అమోలెడ్ ప్యానెల్‌తో వస్తుంది, ఇది వేరియబుల్ రిఫ్రెష్ రేట్ టెక్నాలజీతో అసాధారణమైన బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ స్పెసిఫికేషన్లు కూడా ఫోన్ యొక్క ఫోటోల పనితీరును మెరుగు పరుస్తాయి . అయితే, హాసెల్‌బ్లాడ్ యొక్క ఇంజనీరింగ్ చాతుర్యం తో చేయబడిన సమానమైన అద్భుతమైన కెమెరా టెక్నాలజీ మీరు అందమైన స్క్రీన్‌పై చూసే వివరాలు నాణ్యతగా ఉండేటట్లు రూపొందించారు.

50MP ప్రైమరీ లెన్స్: స్థిరత్వానికి ప్రసిద్ధి చెందింది

వన్ ప్లస్ 11 5G కెమెరా యాప్ ప్రాథమిక 50MP లెన్స్‌కి డిఫాల్ట్ గా సెట్ అవుతుంది. మీరు ఫోటోలు తీసినప్పుడు, ఫలితాలు మిమ్మల్ని షాక్‌కి గురిచేస్తాయి. దాని ఆశ్చర్యకరంగా మంచి కెమెరా పనితీరు వెనుక ఉన్న రహస్య విషయం సోనీ IMX890 ఇమేజ్ సెన్సార్‌లో ఉంది, ఇక్కడ ప్రతి ఒక్క పిక్సెల్ 1.0 మైక్రాన్‌తో కొలుస్తుంది. ఈ 1/1.56-అంగుళాల సెన్సార్‌లోని పెద్ద పిక్సెల్‌లు, విస్తృత f/1.8 ఎపర్చర్‌తో కలిపి, మరింత వివరంగా మరింత కాంతిని సంగ్రహిస్తాయి. తక్కువ-కాంతి వాతావరణంలో కూడా స్పష్టత ప్రత్యేకంగా గమనించవచ్చు. విస్తృత ఎపర్చరు మరియు 24mm-సమానమైన ఫోకల్ లెంగ్త్ కూడా DSLR ఫలితాల వలె బోకె మరియు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌ ఫీచర్లను అందిస్తాయి.

OnePlus 11 Does Justice to the Hasselblad Branding: Here’s Why

మెయిన్ లెన్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) లలో ప్యాక్ చేయబడుతుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా టెక్నాలజీ కారణంగా వన్ ప్లస్ 11 5Gలో మీరు ఉదయం జాగింగ్ లో పరిగెడుతూ వీడియోలు చిత్రీకరించి నప్పటికీ మీకు మంచి నాణ్యమైన వీడియోలు వస్తాయి.

గొప్ప కెమెరా హార్డ్‌వేర్ ను కలిగి ఉండటం సమీకరణంలో ఒక భాగం మాత్రమే. వన్ ప్లస్ తెలివైన పోస్ట్ ప్రాసెసింగ్‌తో కెమెరా అవుట్‌పుట్‌ను మరింత మెరుగుపరుస్తుంది. AI టెక్నాలజీ, హైలైట్ వీడియో మోడ్ వంటి యుటిలిటీలు HDR వీడియో ఫుటేజీని అందిస్తాయి. IMX890 యొక్క అంతర్గత డిజిటల్ రూపంలో సహాయపడుతుంది. మీరు చేయాల్సిందల్లా రికార్డ్ బటన్‌ను నొక్కండి. వన్ ప్లస్ 11 5G మీ కోసం అద్భుతమైన వీడియోలను తీస్తుంది.

32MP టెలిఫోటో షూటర్: పోర్ట్రెయిట్‌ల కోసం ఆప్టిమైజ్ చేయబడింది

మంచి DSLR కెమెరాలో 30mm మరియు 65mm మధ్య ఫోకల్ లెంగ్త్ ఉంటుందని అనుభవజ్ఞులైన పోర్ట్రెయిట్ ఫోటోగ్రాఫర్‌లకు తెలుసు. కానీ, దీనికి వ్యతిరేకంగా వన్ ప్లస్ కంపెనీ యొక్క ప్రశంసలు పొందిన XCD 30mm మరియు 65mm లెన్స్‌లకు బదులు 32MP పోర్ట్రెయిట్ షూటర్‌ను బెంచ్‌మార్క్ చేసింది. ఈ ఖచ్చితమైన ప్రమాణాలు మీ వన్ ప్లస్ పోర్ట్రెయిట్ మోడ్ షాట్‌లు ఎడ్జ్ డిటెక్షన్‌తో తడబడకుండా చూస్తాయి. బ్రాండ్ యొక్క పోర్ట్రెయిట్ మోడ్ కూడా అన్ని ముఖ్యమైన లెన్స్ ఫ్లేర్, డెప్త్ ట్రాకింగ్ మరియు బోకె మోడ్‌ల తో పూర్తి స్థాయి కెమెరాతో పోలిన విధంగా పనిచేసేలా రూపొందించబడింది.

OnePlus 11 Does Justice to the Hasselblad Branding: Here’s Why

Hasselblad సహకారం కారణంగా ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి క్యాప్చర్ చేయబడిన ఫోటోల కోసం వన్ ప్లస్ యొక్క కలర్ సైన్స్‌ను కూడా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. కాంతి తక్కువ ప్రదేశాల్లో ను మరియు అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా వన్ ప్లస్ 11 5G కెమెరా అద్భుతమైన పనితీరును అందిస్తుంది.వన్ ప్లస్ యొక్క బెస్పోక్ కెమెరా సబ్-సిస్టమ్ కారణంగా మీ ఫోటోలు ఖచ్చితమైన స్కిన్ టోన్‌లను క్యాప్చర్ చేస్తాయని మరియు ప్రారంభంలోనే నిజమైన రంగులతో ఫోటోలు మరియు వీడియోలను అందజేస్తుందని నిర్ధారిస్తుంది.

వైడ్ యాంగిల్ లెన్స్ తో ఎక్కువ తీయండి

చాలా స్మార్ట్‌ఫోన్‌లలో మరియు ఫ్లాగ్‌షిప్ ల్లో కూడా, చాలా మంది వినియోగదారులు అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌ ను ఉపయోగించడానికి సంకోచిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి సందర్భాలలో నాసిరకం సెన్సార్ లెన్స్ కాంబో చాలా బ్రాండ్‌లు అందిస్తుంటాయి. అందుకే,వాడటానికి మీరు సంకోచిస్తూ ఉండవచ్చు. కానీ, మీకు సరైన వైడ్-యాంగిల్ లెన్స్ ఎంపిక అయినప్పుడు, ప్రైమరీ కెమెరాతో పనోరమా షాట్‌లను కూడా షూట్ చేసేలా వినియోగదారులను ప్రోత్సహిస్తుంది. వన్ ప్లస్ 11 5G యొక్క 48MP అల్ట్రా-వైడ్ షూటర్ అదృష్టవశాత్తూ, ఆకట్టుకునే ½-అంగుళాల సోనీ IMX581 సెన్సార్‌ తో రావడంతో,ఈ లెన్స్ దాని 115° ఫీల్డ్ ఆఫ్ వ్యూలో మొత్తం ల్యాండ్‌స్కేప్‌ను సీనరీ ని క్యాప్చర్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

ఇప్పుడు, మీ జేబులో ఉన్న ఈ కెమెరాతో నే మీ విహారయాత్ర ఫోటోలు మరియు ఫంక్షన్ల ఫోటోలు ఎంతో అద్భుతంగా తీయవచ్చు. వన్ ప్లస్ లెన్స్‌పై HDR సైన్స్ మరియు ఆటో ఫోకస్‌ను మెరుగుపరిచింది. ఇంకా చెప్పాలంటే, f/2.2 అపర్చర్ మీ మాక్రో ఫోటోలు మీ వద్ద ఉన్న ఇతర బెస్పోక్ లెన్స్‌ల నుండి షాట్‌ల వలె మంచిగా కనిపించేలా చేస్తుంది. వీటిలో స్పష్టత లోపించకుండా నాణ్యతను అందిస్తుంది.

OnePlus 11 Does Justice to the Hasselblad Branding: Here’s Why

అదనపు ముఖ్యమైన ఫీచర్లు

వన్ ప్లస్ మరియు Hasselblad సహకారం కలర్ సైన్స్‌కు మించినది మరియు ఈ ఫోన్‌లో బ్రాండింగ్‌ను కూడా ప్రముఖంగా ఉంచింది. హాసెల్‌బ్లాడ్ కంపెనీ, నిపుణులైన ఫోటోగ్రాఫర్‌లు మరియు వారి క్రాఫ్ట్‌కు నిజమైన అంబాసిడర్‌లు మాస్టర్స్ నుంచి సలహాలతో మాస్టర్స్ మోడ్ కలర్ స్టైల్‌లను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. ప్రసిద్ధ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ యిన్ చావో పోర్ట్రెయిట్ షాట్‌ల కోసం సెరినిటీ స్టైల్‌ను అభివృద్ధి చేయడంలో సహాయపడింది. అయితే అవార్డు గెలుచుకున్న ఆస్ట్రేలియన్ ఫైన్ ఆర్ట్ మరియు సంభావిత ఫోటోగ్రాఫర్ బెన్ థామస్ సాంస్కృతిక ఫోటోగ్రఫీ కోసం రేడియన్స్ ప్రీసెట్‌ను అభివృద్ధి చేశారు. డేవిడ్ పెస్కెన్ రూపొందించిన ల్యాండ్‌స్కేప్ షాట్‌ల కోసం ఎమరాల్డ్ ప్రీసెట్‌తో మీరు మీ వన్ ప్లస్ 11 5G ల్యాండ్‌స్కేప్ షాట్‌లకు అదనపు నైపుణ్యాన్ని జోడించవచ్చు.

ఫోటోగ్రఫీ గ్రూపుల లో చర్చించుకునే విధంగా, మీ వద్ద ఉన్న కెమెరానే అత్యుత్తమ కెమెరా. ఈ రోజు, మేము మా స్మార్ట్‌ఫోన్‌లు లేకుండా చాలా అరుదుగా బయటకు వస్తాము, హడావిడిగా బాత్రూమ్ లో సెల్ఫీ నుండి అద్భుతమైన గోల్డెన్ అవర్ సన్‌సెట్ పోర్ట్రెయిట్‌ల వరకు ప్రతిదానికీ వాటిని ఎంపిక చేసే సాధనంగా మారుస్తాము. కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌లో గొప్ప పనితీరును అందించే పరిశోధన మరియు ప్రశంసలు పొందిన స్పెసిఫికేషన్‌లతో, వన్ ప్లస్ 11 5G నాణ్యమైన పనితీరు అందిస్తుంది. అన్నింటికంటే, ముఖ్యంగా మనము ఎప్పుడు ఏ సందర్భంలోనైనా మన స్మార్ట్‌ఫోన్‌ల నుండి అద్భుతమైన ఫోటోలు మరియు వీడియోలు కోరుకుంటాము, దీనికోసం మీకు వన్ ప్లస్ 11 5G మంచి ఎంపిక అవుతుంది.

Best Mobiles in India

English summary
OnePlus 11 Does Justice to the Hasselblad Branding: Here’s Why
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X