ఈ OnePlus స్మార్ట్‌ఫోన్ పై రూ.3000 ధర తగ్గింది! కొత్త ధర, బ్యాంకు ఆఫర్ వివరాలు
వన్‌ప్లస్ 11R దాని అద్భుతమైన ఫీచర్లు మరియు అనుకూలమైన ధర కు కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ పొందిన స్మార్ట్‌ఫోన్. ఆశ్చర్యకరంగా, కంపెనీ ఈ OnePlus 11R 5G 16GB RAM వేరియంట్‌పై రూ. 3000 ధర తగ్గింపు ప్రకటించింది.అలాగే, 8 GB RAM వేరియంట్‌పై రూ. 2000 తగ్గింపును అందిస్తోంది.
వీటికి అదనంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ల యొక్క తగ్గింపు ఆఫర్లు కూడా ఉంటాయి. ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు ఉంటుందా? అధికారికమా లేదా అనధికారికమా అనేది ఖచ్చితంగా తెలియదు. మీరు సరసమైన ధర పరిధిలో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, OnePlsu 11R 5G సరైన ఎంపిక కావచ్చు.

OnePlus 11R పై ఆఫర్ డిస్కౌంట్ వివరాలు
వన్‌ప్లస్ 11R స్మార్ట్‌ఫోన్ Amazon India, Croma మరియు OnePlus ఆన్‌లైన్ స్టోర్‌లో తగ్గింపు ఆఫర్ తో అందుబాటులో ఉంది. ఇది గెలాక్సీ సిల్వర్ మరియు సోనిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
తగ్గింపు ఆఫర్ వివరాలు గమనిస్తే, వన్‌ప్లస్ 11R యొక్క 8GB RAM మరియు 128GB స్టోరేజీ వేరియంట్ పై రూ. 2000 తగ్గింపు తర్వాత ఇప్పుడు రూ. 37,999 కి అందుబాటులో ఉంది. దీనికి అదనంగా,ఐసిఐసిఐ బ్యాంక్ మరియు వన్ కార్డ్‌తో బ్యాంకు ఆఫర్ ద్వారా రూ. 1000 తగ్గింపు లభిస్తుంది. అంటే మీరు ఈ 8GB RAM వేరియంట్ ను ధర రూ. 36,999 కే పొందవచ్చు.
అలాగే, 16GB RAM మరియు 256GB వేరియంట్ పై రూ. 3000 తగ్గింపు తర్వాత రూ. 41,999 కి అందుబాటులో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ మరియు వన్ కార్డ్‌తో అదనంగా రూ. 1000 కార్డ్ తగ్గింపు లభిస్తుంది.అంటే మీరు ఈ 16GB RAM వేరియంట్ ను ధర రూ. 40,999 కే పొందవచ్చు.
OnePlus 11R స్పెసిఫికేషన్ల వివరాలు:
వన్‌ప్లస్ 11R 5G స్మార్ట్‌ఫోన్ గతేడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ఇది 2772 X 1240 పిక్సెల్‌లతో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది, 1450 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందిస్తోంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ వంపు అంచులు మరియు ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్‌ను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌తో 16GB LPDDR5X RAM మరియు 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో జత చేయబడింది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఆక్సిజన్ OS 13 పై పనిచేస్తుంది.
ఇంకా, ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో, 100-వాట్ సూపర్ ఊక్ S ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని అందిస్తుంది. మరియు బాక్స్ తో పాటు అడాప్టర్ కూడా వస్తుంది. ఈ పరికరం 25 నిమిషాల్లో 1-100% రీఛార్జి చేస్తుంది. కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా ఉంది. మరియు ఇది 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో మరియు 2MP మాక్రో సెన్సార్‌తో జత చేయబడింది.
సెల్ఫీల కోసం, ముందు భాగంలో 16MP కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ లో 5G, GPS, Wi-Fi 6 మరియు బ్లూటూత్ 5.3 వంటి కొన్ని కనెక్టివిటీ ఫీచర్లు OnePlus 11R 5G లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 8.7mm మందం మరియు 204 గ్రాముల బరువు ఉంటుంది.
మీరు OnePlus 11R ని ₹37,999 వద్ద కొనుగోలు చేయడం మంచి నిర్ణయమేనా?
వన్‌ప్లస్ 11R 5G గత సంవత్సరం లాంచ్ అయినప్పటికీ, ఇప్పుడు కూడా ఇది చాలా శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్. ఇది స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ OnePlus 12R వలె అదే సోనీ IMX890 ప్రైమరీ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే, డిజైన్ కూడా ఒకే విధంగా ఉంటాయి.
అయితే, వన్‌ప్లస్ 12R పెద్ద బ్యాటరీ, మెరుగైన డిస్‌ప్లే, IP54 స్ప్లాష్ ప్రూఫ్ ప్రొటెక్షన్, మరింత శక్తివంతమైన చిప్‌సెట్‌తో సహా అనేక అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.కానీ,ఇటీవల ప్రారంభించిన iQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ OnePlus 11R కంటే మరింత శక్తివంతమైన చిప్‌సెట్ మరియు ఇతర మెరుగుదలలను కలిగి ఉంది. ధరకూడా తక్కువ.


Click it and Unblock the Notifications








