8GB ర్యామ్, 50MP కెమెరా OnePlus 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
వన్‌ప్లస్ 11R 5G స్మార్ట్‌ఫోన్ ను భారీ తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.39,999 గా ఉంది. అయితే ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎటువంటి బ్యాంకు ఆఫర్‌లతో సంబంధం లేకుండా 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.27,999 కే (Oneplus 11R 5G Price Drop) కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఆకట్టుకొనే డిజైన్ సహా మెరుగైన స్పెసిఫికేషన్ లను కలిగి ఉంది.
మూడు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు :
వన్‌ప్లస్ 11R స్మార్ట్ ఫోన్ కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మూడు రంగుల్లో లభిస్తోంది. అమెజాన్‌లో గెలాస్టిక్ సిల్వర్, సోలార్ రెడ్, సోనిక్ బ్లాక్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్ 11R 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్ 11R 5G స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల సూపర్ ఫ్యూయడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2772*1240 పిక్సల్ రిజల్యూషన్ సహా 120Hz వరకు డైనమిక్ రీఫ్రెష్ రేట్‌తో అందుబాటులో ఉంది. 1450 గరిష్ఠ బ్రైట్‌నెస్, 450ppi పిక్సల్ డెన్సిటీిని కలిగి ఉంది.
3 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు :
వన్‌ప్లస్ 11R హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత Oxygen OS 13 ను కలిగి ఉంటుంది. 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది. మరియు 4nm ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 + జెన్ 1 చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్ Aderno 730 GPU తో జతచేయబడింది.

8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ మరియు 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్లలో ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. అదే 16GB ర్యామ్ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది.
5000mAh బ్యాటరీ, 50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వన్‌ప్లస్ 11R స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రధాన కెమెరా, 120 డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 100W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications