6.74 అంగుళాల డిస్‌ప్లే, 8GB ర్యామ్ OnePlus ఫోన్‌పై డిస్కౌంట్.. బ్యాంకు కార్డులపై రూ.2000 అదనపు తగ్గింపు..!
వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. విడుదల ధరతో పోలిస్తే వన్‌ప్లస్ 11R 5G స్మార్ట్‌ఫోన్ (Oneplus 11R 5G Smartphone) ధర రూ.10,000 తగ్గింపును పొందింది. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.
ఈ వన్‌ప్లస్ 11R స్మార్ట్‌ఫోన్ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఆకట్టుకొనే డిజైన్‌తో లాంచ్ అయింది. కర్వడ్ డిస్‌ప్లే సహా అప్‌డేటెడ్ సాఫ్ట్‌వేర్ పైన పనిచేస్తుంది. మరియు స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 100W సూపర్‌వోక్ ఛార్జింగ్ సపోర్టుతో పనిచేస్తుంది.

వన్‌ప్లస్ 11R 5G స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను ప్రస్తుతం అమెజాన్‌లో రూ.29,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్ సెట్ గెలాస్టిక్ సిల్వర్, సోలార్ రెడ్, సోనిక్ బ్లాక్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ సిల్వర్ మరియు బ్లాక్ వేరియంట్‌లను అన్ని బ్యాంకు కార్డులపై రూ.2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు వడ్డీ లేని EMI (No Cost EMI) ఆఫర్‌ను కూడా వినియోగించుకోవచ్చు. మరియు ఎక్స్చేంజీ ద్వారా రూ.28,050 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
వన్‌ప్లస్ 11R 5G స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 11R 5G స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2772*1240 పిక్సల్ రిజల్యూషన్, మరియు గరిష్ఠంగా 120Hz వరకు డైనమిక్ రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. మరియు 1450 గరిష్ఠ బ్రైట్‌నెస్, 1440Hz హై ఫ్రీక్విన్సీ డిమ్మింగ్ విజువల్ అనుభూతిని మెరుగుపరుస్తుంది.
ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ 4nm ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ Aderno 730 GPU తో జతచేయబడింది. ఫలితంగా మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత OxygenOS 13 పైన పనిచేస్తుంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 50MP ప్రధాన కెమెరా, 120 డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 8MP అల్ట్రావైడ్ లెన్స్ మరియు 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 16MP కెమెరాను అమర్చారు.
దీంతోపాటు ఈ వన్ ప్లస్ 11R 5G స్మార్ట్ ఫోన్ 100W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ మరియు 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








