వన్‌ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్‌లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
వన్‌ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల అయింది. గత సంవత్సరం సోలార్ రెడ్ వేరియంట్ 18GB ర్యామ్ + 512GB స్టోరేజీని విడుదల చేయగా తాజాగా వన్‌ప్లస్ 11R 5G సోలార్ రెడ్ (Oneplus 11R 5G Solar Red Variant 2024) 8GB ర్యామ్ +128GB అంతర్గత వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఈ వేరియంట్ అందుబాటు ధరకే విడుదల చేసింది.
వన్‌ప్లస్ 11R సోలార్ రెడ్ వేరియంట్ స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 11R సోలార్ రెడ్ హ్యాండ్ సెట్ 6.74 అంగుళాల ప్ల్యూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1450 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 1240*2772 పిక్సల్ రిజల్యూషన్‌తో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు వేగాన్ లెదర్ ప్యానల్‌ను కలిగి ఉంది.

100W సూపర్‌వోక్ ఫాస్ట్ ఛార్జింగ్ :
ఈ సోలార్ రెడ్ వేరియంట్ 4nm క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు అడెర్నో 730 ప్రాసెసర్‌తో జతచేయబడి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 పైన పనిచేస్తుంది. 100W Supervooc ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్ సెట్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టు, f/1.8 అంగుళాల అపేచర్‌తో 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్‌తో 8MP అల్ట్రా వైడ్ కెమెరా, f/2.4 అపేచర్‌తో 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను అమర్చారు.
18GB ర్యామ్ వేరియంట్ ఉత్పత్తి నిలిపివేత :
భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ ఇన్- డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ కొత్త వేరియంట్ విడుదలతో గత సంవత్సరం విడుదల చేసిన 18GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ సోలార్ రెడ్ వేరియంట్ ఉత్పత్తిని సంస్థ నిలిపి వేసింది.
వన్‌ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ ధర :
వన్‌ప్లస్ 11R 5G సోలార్ రెడ్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.35,999 గా ఉంది. HDFC, ICICI మరియు వన్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లు రూ.1000 తగ్గింపును పొందవచ్చు. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ మరియు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








