Home
Mobile

వన్‌ప్లస్‌ 12 5G స్మార్ట్‌ఫోన్‌ కొత్త కలర్‌ వేరియంట్ టీజర్‌ విడుదల.. పూర్తి వివరాలు..!!

వన్‌ప్లస్‌ సంస్థ ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ వన్‌ ప్లస్‌ 12 (OnePlus 12 New Colour Variant teased) ఈ సంవత్సరం జనవరిలో లాంచ్ అయ్యాయి. అయితే తాజాగా ఈ హ్యాండ్‌ సెట్‌కు సంబంధించిన టీజర్‌ ను విడుదల చేసింది. జనవరిలో విడుదల సమయంలో సిల్కీ బ్లాక్‌, Flowy Emerald రంగుల్లో అందుబాటులో ఉంది. తాజా టీజర్‌ ఆధారంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ మరో కలర్‌ వేరియంట్‌ త్వరలో భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ కానుంది. పూర్తి వివరాలు.

ఈ వన్‌ప్లస్‌ టీజర్‌ ఆధారంగా కెమెరా మాడ్యుల్‌ సిల్వర్ కలర్‌లో ఉంది. దీంతో త్వరలో లాంచ్ కానున్న కొత్త కలర్ వేరియంట్‌ తెలుపు రంగులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం వన్‌ప్లస్‌ 12 తెలుపు రంగు స్మార్ట్‌ఫోన్‌ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది.

Oneplus 12 5G Smartphone new variant teased

వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌ కొత్త వేరియంట్ స్పెసిఫికేషన్‌లలో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం లేదు. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 6.82 అంగుళాల LTPO అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది. 90.8 స్క్రీన్‌ టూ బాడీ రేషియోను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను పొందుతుంది.

ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS :
ఈ వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Oxygen OS 14 పైన పనిచేస్తుంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. Adreno 750 చిప్‌సెట్‌తో జతచేయబడుతుంది. 16GB LPDDR5x ర్యామ్‌ మరియు 512GB UFS 4.0 స్టోరేజీని కలిగి ఉంది.

50MP +64MP+48MP కెమెరాలు :
వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT 808 కెమెరా, OIS ఆధారిత 3X జూమింగ్‌ సామర్థ్యంతో 64MP OmniVision OV64B పెరిస్కోప్‌ లెన్స్‌, 48MP సోనీ IMX581 కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చారు.

26 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్‌ :
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌ 100W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 5400mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని ద్వారా 1-100 శాతం ఛార్జింగ్‌ను 26 నిమిషాల్లోనే ఛార్జింగ్ చేయవచ్చు. 50W AIRVOOC వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. 12GB ర్యామ్‌+ 256GB అంతర్గత స్టోరేజీ మరియు 16GB ర్యామ్+ 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 12 5G Smartphone new colour variant teased expected to launch soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X