Home
Mobile

OnePlus కొత్త స్మార్ట్‌ఫోన్ల కలర్‌, ధర వివరాలు లీక్‌.. స్మార్ట్‌ఫోన్లు ఎప్పుడు లాంచ్‌ కానున్నాయంటే?

వన్‌ప్లస్‌ 12 మరియు వన్‌ప్లస్‌ 12R (OnePlus 12 and 12R) స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో జనవరి 23న విడుదల కానున్నాయి. ఈ ఫోన్లు ఇప్పటికే చైనాలో విడుదల అయ్యాయి. అయితే చైనాలో విడుదలైన ఫోన్లు భారత్‌ విడుదల కానున్న ఫోన్లు ఒకేరకమైన ఫీచర్లను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ 11R హ్యాండ్‌సెట్‌కు తర్వాత తరం వెర్షన్‌గా లాంచ్‌ అవుతుంది మరియు వన్‌ప్లస్‌ ACE 3 రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా రానుంది. ఈ ఫోన్‌ జనవరిలో చైనాలో లాంచ్‌ కానుంది. అయితే తాజాగా భారత్‌లో విడుదల కానున్న వన్‌ప్లస్‌ 12 మరియు వన్‌ప్లస్‌ 12R ధర, కలర్‌ ఆప్షన్‌ లీక్‌ అయింది.

Oneplus 12R colors and price details leaked

చిప్‌స్టర్ యోగేష్‌ బ్రార్‌ వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ వివరాలను తన X (ట్విట్టర్‌)తో పోస్టు చేశారు. ఈ పోస్టు ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్‌ బ్లాక్, గ్రీన్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ 16GB ర్యామ్, 512GB గరిష్ఠ స్టోరేజీలను కలిగి ఉండే అవకాశం ఉంది. టిప్‌స్టర్‌ నివేదిక ప్రకారం.. ఈ ఫోన్‌ ధర రూ.58 వేల నుంచి రూ.60 వేల ఉంటుంది.

అదే విధంగా వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్‌, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ కూడా గరిష్ఠంగా 16GB ర్యామ్‌, 512GB స్టోరేజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్‌ ధర రూ.40,000 నుంచి రూ.42,000 గా ఉంది.

Oneplus 12R colors and price details leaked

వన్‌ప్లస్‌ 12R హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్‌ ఆధారిత ఆక్సిజన్‌OS 14 పైన పనిచేస్తుంది. 6.78 అంగుళాల LTPO 4.0 ProXDR స్క్రీన్‌తో వస్తుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. మరియు గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రాటెక్షన్‌తో వస్తుంది. వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది.

50MP IMX890 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్‌, 2MP మ్యాక్రో సెన్సార్‌తో వస్తుంది. మరియు ముందువైపు సెల్పీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 100W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో వస్తుంది.

చైనాలో విడుదలైన వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 3 SoC మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్OS 14ను కలిగి ఉంది. మరియు 6.82 అంగుళాల క్వాడ్‌ HD+ LTPO OLED స్క్రీన్‌తో వచ్చింది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

కెమెరాల విషయానికి వస్తే OIS ఫీచర్‌తో 50MP సోనీ LYT-808 ప్రైమరీ సెన్సార్‌, OIS ఫీచర్‌తో 64MP టెలీఫోటో కెమెరా, 3x ఆప్టికల్‌ జూమ్‌, 48MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌తో వస్తుంది. మరియు 32MP సెల్పీ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్ 100W సూపర్‌వోక్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5400mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 50W వైరలెస్‌, 10W రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో వస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 12 and oneplus 12R colors and price details leaked ahead of launch in january
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X