OnePlus 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి.. ఫీచర్లు, ధర, సేల్ వివరాలు..!
వన్‌ప్లస్ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఇవాళ విడుదల అయ్యాయి. వన్‌ప్లస్ 12 సిరీస్ (OnePlus 12 Series Launched) భారత్‌లో లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో వన్‌ప్లస్ 12 మరియు వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. దీంతోపాటు వన్‌ప్లస్ బడ్స్ 3 ని కూడా విడుదల చేశారు.
వన్‌ప్లస్ 12 స్పెసిఫికేషన్లు : వన్‌ప్లస్ 12 హ్యాండ్‌సెట్ 6.82 అంగుళాల 2k ప్రో XDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 3168*1440 రిజల్యూషన్‌తో వస్తుంది. LTPO టెక్నాలజీ సపోర్టుతో వస్తుంది. ఫలితంగా రీఫ్రెష్ రేట్ 1Hz నుంచి 120Hz వరకు ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసుకుంటుంది.

ఈ ఫోన్ 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ముందువైపు పంచ్ హోల్ స్టైల్ నాచ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ముందువైపు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంటుంది. అదే వెనుకవైపు కార్నింగ్ గ్లాస్ 5 రక్షణను పొందుతుంది.
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX581 ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా OIS ( ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ), EIS ( ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ) సపోర్టుతో వస్తుంది.

OIS, EIS సపోర్టుతో 64MP OmniVision OV64B టెలిఫొటో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది 6X ఇన్ సెన్సార్ జూమ్, 120X డిజిటల్ జూమ్‌తో వస్తుంది. 48MP సోనీ IMX581 అల్ట్రావైడ్ సెన్సార్‌ను కలిగి ఉంది. EIS సపోర్టుతో వస్తుంది. అలాగే ముందువైపు 32MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా EIS సపోర్టుతో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను అడెన్నో 750 GPUతో జతచేయబడుతుంది. ఈ చిప్‌సెట్ ట్రినిటీ ఇంజిన్ ప్లాట్‌ఫాం ఆధారంగా పనిచేస్తుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ సమయాల్లో వేగం, మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్OS 14 పైన పనిచేస్తుంది.

వన్‌ప్లస్ 12 హ్యాండ్‌సెట్ 80W సూపర్‌వోక్ వైరడ్ ఛార్జింగ్, 50W ఎయిర్‌వోక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5400mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 100W సూపర్‌వోక్ వైరడ్ ఛార్జింగ్ సపోర్టుతో 0-100 శాతం ఛార్జింగ్‌ను కేవలం 26 నిమిషాల్లోనే చేస్తుంది.
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 12GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ మరియు 16GB ర్యామ్+ 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.64,999గా ఉంది. అదే 16GB ర్యామ్ వేరియంట్ ధర రూ.69,999 గా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ముందస్తు బుకింగ్ ఇవాళ్టి నుంచి (జనవరి 23) నుంచి ప్రారంభం కానుంది. జనవరి 30వ తేది నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో రూ.2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. మరియు 12 నెలల వరకు నో కాస్ట్ EMI సదుపాయం కల్పించింది.

వన్‌ప్లస్ 12r స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు:
వన్‌ప్లస్ 12r స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5k 10 bit అమోలెడ్ ProXDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. HDR10+, LTPO4 సపోర్టుతో వస్తుంది. LTPO 4వ టెక్నాలజీని కలిగి ఉన్న తొలి వన్‌ప్లస్ ఫోన్‌గా 12r నిలిచింది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 పైన పనిచేస్తుంది. మరియు స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే రక్షణకు కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో వస్తుంది. ఇవి స్పష్టమైన విజువల్, అల్ట్రా స్మూత్ స్క్రోలింగ్‌ను అందిస్తాయని సంస్థ పేర్కొంది.

ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX89 ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్పీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16MP కెమెరాను అమర్చారు. ఈ వన్‌ప్లస్ 12r స్మార్ట్‌ఫోన్ 100W సూపర్‌వోక్ ఛార్జింగ్ (వైరడ్) సపోర్టుతో 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
వన్‌ప్లస్ 12r రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ, 16GB ర్యా్మ్ +256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది. 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. 16GB ర్యామ్ వేరియంట్ ధర రూ.45,999గా ఉంది. ఈ ఫోన్ ఫిబ్రవరి 6 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








