వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు..!
ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అయితే గత సంవత్సరం విడుదల అయిన వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ ఫోన్ 6.82 అంగుళాల భారీ డిస్‌ప్లే, మరియు ట్రిపుల్ కెమెరా సహా ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది.
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్ లో గత సంవత్సరం జనవరిలో విడుదల అయింది. ఇప్పటికీ టాప్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఒకటిగా ఉంది. విడుదల ధరతో పోలిస్తే ఈ హ్యాండ్‌సెట్‌ను భారీ డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. విడుదల సమయంలో ఈ ఫోన్ 12GB ర్యా్మ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.64999 గా ఉండేది.

ప్రస్తుతం అమెజాన్‌లో 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.51998 గా ఉంది. అంటే సుమారుగా రూ.13 వేల తగ్గింపును పొందవచ్చు. అదే 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.69,999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.56998 గా ఉంది. సుమారుగా రూ.13 వేల తగ్గింపు ధరకు అందుబాటులోకి ఉంది.
దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా గరిష్టంగా రూ.4000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ ప్రస్తుతం సిల్కీ బ్లాక్, గ్లేసియల్ వైట్, ఫ్లోలీ ఎమరాల్డ్ బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు :
ఈ వన్‌ప్లస్ (OnePlus 12 Smartphone) హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. మరియు Adreno 750 ను కూడా కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 16GB LPDDR4X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీని సపోర్టు చేస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 పైన పనిచేస్తోంది. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని వన్‌ప్లస్ వెల్లడించింది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.82 అంగుళాల LTPO అమోలెడ్ 2k డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది.
ఈ ఫోన్ కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 808 ప్రైమరీ కెమెరా, 3x జూమ్‌తో 64MP పెరిస్కోప్ లెన్స్, 48MP సోనీ IMX581 కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.
ఈ వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W SUPERVOOC వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5400mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 100 శాతం ఛార్జింగ్‌ను కేవలం 26 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చని వన్‌ప్లస్ చెబుతోంది.


Click it and Unblock the Notifications








