Home
Mobile

12GB ర్యామ్‌, 256GB స్టోరేజీ వన్‌ప్లస్ 12 కొత్త వేరియంట్‌ విడుదల... స్పెసిఫికేషన్‌లు, సేల్‌ వివరాలు..!!

వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ ఫోన్‌ కొత్త కలర్‌ వేరియంట్ (Oneplus 12 Glacial white colour variant) తాజాగా భారత్‌ మార్కెట్‌ లో విడుదల అయింది. గ్లేసియల్‌ వైట్‌ వేరియంట్‌ పేరుతో లాంచ్ అయింది. ఈ వేరియంట్‌ లిమిటెడ్ ఎడిషన్‌ గా అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్‌ 12 స్టాండర్డ్‌ మోడల్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ గ్లేసియల్‌ వైట్‌ వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌ ధర సహా సేల్‌ తేదీలను కూడా సంస్థ వెల్లడించింది.

వన్‌ప్లస్‌ 12 గ్లేసియల్‌ వైట్‌ స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌ మరియు 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.64,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ను జూన్‌ 6 నుంచి సేల్‌ ప్రారంభం అవుతుంది. వన్‌ ప్లస్‌ అధికారిక వెబ్‌ సైట్‌, వన్‌ ప్లస్‌ స్టోర్‌లు సహా అమెజాన్‌ మరియు ఇతర భాగస్యామ్య స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.

Oneplus 12 Glacial white colour variant launched in india

ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.3000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు జూన్‌ 6 నుంచి 20వ తేదీ వరకు రూ.2000 అదనపు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.12000 తగ్గింపును పొందవచ్చు. మరియు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు.

వన్‌ప్లస్‌ 12 గ్లేసియల్‌ వైట్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.82 అంగుళాల LTPO అమోలెడ్‌ 2k డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్‌తో లాంచ్ అయింది. మరియు 90.8 స్క్రీన్‌ టూ బాడీ రేషియోను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను పొందుతుంది.

వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ కొత్త కలర్‌ వేరియంట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OxygenOS 14 పైన పనిచేస్తుంది. మరియు క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. Adreno 750 చిప్‌సెట్‌తో జతచేయబడుతుంది. Cryo వెలాసిటీ కూలింగ్‌ సిస్టమ్‌తో 16GB LPDDRx ర్యామ్‌ మరియు 512GB UFS 4.0 స్టోరేజీని కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 4 ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌ లు మరియు 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను పొందుతుందని సంస్థ తెలిపింది. దీంతోపాటు ఈ వేరియంట్‌ 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5400mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ద్వారా 1-100 శాతం ఛార్జింగ్‌ను 26 నిమిషాల్లోనే ఛార్జింగ్ చేయవచ్చు. 50W AIRVOOC వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ గ్లేసియల్‌ వైట్‌ వేరియంట్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP సోనీ LYT 808 కెమెరా, OIS ఆధారిత 3X జూమింగ్‌ సామర్థ్యంతో 64MP OmniVision OV64B పెరిస్కోప్‌ లెన్స్‌, 48MP సోనీ IMX581 కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాను అమర్చారు.

Best Mobiles in India

English summary
Oneplus 12 smartphone Glacial white colour variant launched in india specs and sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X