Home
Mobile

వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ కొత్త వేరియంట్‌ సేల్ ప్రారంభం.. ఇలా చేస్తే రూ.5000 తగ్గింపు..!!

వన్‌ప్లస్‌ నుంచి ఇటీవల వన్‌ ప్లస్‌ 12 గ్లేసియల్‌ వైట్‌ కలర్‌ వేరియంట్ విడుదల అయింది. ఈ హ్యాండ్‌ సెట్‌ 12GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ (OnePlus 12 Smartphone Glacial white Varaint sale) ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్‌ ప్రారంభం అయింది. వన్‌ప్లస్‌ స్టో్ర్‌లు, వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌, వన్‌ప్లస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంస్థల స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్‌ 12 కొత్త కలర్‌ వేరియంట్‌ను ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు జూన్‌ 6 నుంచి 20వ తేదీ వరకు రూ.2000 కూపన్‌తో అదనపు తగ్గింపును పొందవచ్చు. మరియు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ ధర రూ.64999 గా ఉంది.

Oneplus 12 Smartphone Glacial white variant sale started

వన్‌ప్లస్‌ 12 గ్లేసియల్‌ వైట్‌ స్పెసిఫికేషన్‌లు : స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.82 అంగుళాల LTPO అమోలెడ్‌ 2k డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్‌తో లాంచ్ అయింది. డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను పొందుతుంది.

వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ గ్లేసియల్‌ వేరియంట్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ LYT 808 ప్రధాన కెమెరా.. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంది. మరియు OIS ఆధారిత 3X జూమింగ్‌ సామర్థ్యంతో 64MP OmniVision OV64B పెరిస్కోప్‌ లెన్స్‌, 48MP సోనీ IMX581 కెమెరాను అమర్చారు. దీంతోపాటు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ కొత్త కలర్‌ వేరియంట్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. Adreno 750 చిప్‌సెట్‌తో జతచేయబడుతుంది. Cryo వెలాసిటీ కూలింగ్‌ సిస్టమ్‌తో 16GB LPDDR5X ర్యామ్‌ మరియు 512GB UFS 4.0 స్టోరేజీని కలిగి ఉంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OxygenOS 14 పైన పనిచేస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 4 ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లు మరియు 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని సంస్థ తెలిపింది. దీంతోపాటు ఈ వేరియంట్‌ 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5400mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ద్వారా 1-100 శాతం ఛార్జింగ్‌ను 26 నిమిషాల్లోనే ఛార్జింగ్ చేయవచ్చు. 50W AIRVOOC వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Oneplus 12 Smartphone Glacial white variant sale is live on amazon offers details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X