50MP + 64MP + 48MP కెమెరాలు, 100W ఛార్జింగ్ సపోర్టు OnePlus స్మార్ట్‌ఫోన్‌పై రూ.7000 బ్యాంక్ డిస్కౌంట్..!
వన్‌ప్లస్ జనవరి 7వ తేదీన వింటర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌లో వన్‌ప్లస్ 13 సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ లో వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌ను (OnePlus 12 Smartphone Price Drop) భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా గరిష్ఠంగా రూ.7000 తగ్గింపును పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం మూడు రంగుల్లో లభిస్తుంది.
ప్రస్తుతం వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ (OnePlus 12 Amazon Offer) భారత్ మార్కెట్‌లో 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 12GB ర్యామ్ వేరియంట్ ధర రూ.64,999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.59,999 గా ఉంది. అదే 16GB ర్యామ్ వేరియంట్ ధర రూ.69,999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.64,999 గా ఉంది.

ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డు ద్వారా గరిష్ఠంగా రూ.7,000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.52999 గా ఉండనుంది. అదే అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా రూ.4,300 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు SBI, HDFC, యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా తగ్గింపును పొందవచ్చు.
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్ 12 హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.82 అంగుళాల LTPO అమోలెడ్ 2k డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను పొందుతుంది.

ఈ వన్‌ప్లస్ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు Adreno 750 చిప్‌సెట్, 16GB LPDDR4x ర్యామ్ మరియు 512GB UFS 4.0 స్టోరేజో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 పైన పనిచేస్తుంది. 4 OS అప్‌డేట్‌లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందుతుంది.
కెమెరా విభాగం పరంగ ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్‌తో 50MP సోనీ LYT 808 ప్రైమరీ కెమెరా, 3X జూమ్‌తో 64MP OmniVision OV64B పెరిస్కోప్ కెమెరా, 48MP సోనీ IMX581 కెమెరాలను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 50W ఎయిర్‌వూక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5400mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కేవలం 26 నిమిషాల్లోనే పూర్తి బ్యాటరీని ఛార్జింగ్ చేయవచ్చని వన్‌ప్లస్ చెబుతోంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications







