50MP+ 64MP+ 48MP కెమెరాలు, 5400mAh బ్యాటరీ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5000 తగ్గింపు..!!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తాజాగా తన ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ వన్‌ప్లస్ 12 ధరను భారీగా తగ్గించింది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లలో వన్‌ప్లస్ 12 ఒకటిగా ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ రెండింటిపై ఏకంగా రూ.5000 ధరను (Oneplus 12 Smartphone Received Pricecut) తగ్గించింది. కొత్త ధరలతో ఈ ఫోన్ భారత్‌లో అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.64,999 గా ఉండగా... రూ.5000 ధర తగ్గింపుతో ప్రస్తుతం ధర రూ.59,999 గా ఉంది. 16GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.69,999 గా ఉండగా.. ధర తగ్గింపుతో ప్రస్తుతం ధర రూ.64,999 గా ఉంది.

దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.7000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపింది. మరియు 12 నెలలపాటు నో కాస్ట్ EMI ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది. ఈ వన్‌ప్లస్ 12 హ్యాండ్‌సెట్ గ్లేసియల్ వైట్, సిల్కీ బ్లాక్, ఫ్లోవీ ఎమరాల్డ్ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ 6.82 అంగుళాల 2K కర్వడ్ OLED ProXDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్ రేట్, 3168*1440 పిక్సల్ రిజల్యూషన్‌తో QHD+, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్‌తో అందుబాటులో ఉంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ రక్షణను పొందుతుంది.

ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 ను కలిగి ఉంది. మరియు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ Adreno 750 చిప్‌సెట్, 16GB LPDDR5X ర్యామ్ మరియు 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేయబడింది. Cryo వెలాసిటీ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
హ్యాండ్‌సెట్ 4 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు మరియు 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని సంస్థ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50W AIRVOOC వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5400mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను కేవలం 26 నిమిషాల్లో 1-100 శాతం ఛార్జింగ్‌ను పూర్తిచేయవచ్చు.
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 808 ప్రైమరీ కెమెరా, OIS, 3X జూమింగ్ సామర్థ్యంతో 64MP OmniVision OV64B పెరిస్కోప్ లెన్స్, 48MP సోనీ IMX581 కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








