Home
Mobile

OnePlus 12: 24GB RAM , 2K డిస్ప్లే & 50W వైర్లెస్ ఛార్జింగ్ తో లాంచ్ అయింది!

OnePlus 12 స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు స్పెసిఫికేషన్‌లు ఈ రోజు చైనాలో అధికారికంగా లాంచ్ చేయబడ్డాయి. ఈ కొత్త OnePlus ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంతో సహా గ్లోబల్ మార్కెట్‌లలోకి వస్తుందని భావిస్తున్నారు.

ఈ OnePlus 12 ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ జనవరి 24 అని అంచనాలున్నాయి. వన్ ప్లస్ 12 యొక్క సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC ప్రాసెసర్, వైర్‌లెస్ ఛార్జింగ్, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది.

OnePlus 12 With Snapdragon 8 Gen 3 Chipset, 2K OLED Display And 5400mAh Battery Launched. Price,Specifications

చైనాలో ఈ OnePlus 12 స్మార్ట్ ఫోన్ యొక్క ధర, లభ్యత వివరాలు
OnePlus 12 స్మార్ట్ ఫోన్ 12GB RAM మరియు 256GB స్టోరేజీ తో కూడిన బేస్ మోడల్ యొక్క ధర CNY 4,299 (సుమారు రూ. 50,600) నుండి ప్రారంభమవుతుంది. అదే విధంగా 16GB RAM మరియు 512GB స్టోరేజీ వేరియంట్ వేరియంట్ ధర CNY 4,799 (రూ. 56,500) మరియు వన్ ప్లస్ 12 యొక్క 16GB + 1TB మరియు 24GB + 1TB యొక్క మరో రెండు వేరియంట్‌లలో కూడా వస్తుంది, వీటి ధర వరుసగా CNY 5,299 (రూ. 62,400) మరియు CNY 5,799 (సుమారు రూ. 68,200) గా ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్లు ఆకుపచ్చ, నలుపు మరియు తెలుపు మూడు రంగు ఎంపికలలో వస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో డిసెంబర్ 11న అమ్మకానికి రానుంది. వన్ ప్లస్ సంస్థ ఈ ఫోన్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది.

వన్ ప్లస్ 12 స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్ల వివరాలు
ఈ వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82 అంగుళాల QHD+ 2K OLED LTPO డిస్‌ప్లే 4,500 nits పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇతర స్మార్ట్‌ఫోన్‌లో ఎన్నడూ లేని విధంగా ఉంది.

ఇంకా, ఈ వన్ ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ అత్యధిక స్థాయి డిస్‌ప్లేమేట్ A+ సర్టిఫికేషన్‌ను పొందడానికి మొదటి దేశీయ 2K డిస్‌ప్లేను కలిగి ఉందని పేర్కొంది. ఇది డాల్బీ విజన్, 10బిట్ కలర్ డెప్త్, ProXDR, 2160Hz PWM డిమ్మింగ్ మరియు 'రెయిన్ టచ్' సపోర్ట్‌తో కూడా వస్తుంది.

ఇక ప్రాసెసర్ మరియు చిప్ సెట్ వివరాలు గమనిస్తే, దాని హుడ్ కింద తాజా స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. RAM మరియు స్టోరేజీ వివరాలు గమనిస్తే చైనాలో, ఈ వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ గరిష్టంగా 24GB వరకు LPDDR5X RAM మరియు 1TB UFS 4.0 స్టోరేజీ తో వస్తుంది.

అలాగే, కెమెరా ఫీచర్ల వివరాలు గమనిస్తే. ఈ వన్ ప్లస్ 12 OIS తో 50MP సోనీ LYT-808 ప్రైమరీ కెమెరా, 48MP సోనీ IMX581 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 3x టెలిఫోటో జూమ్‌తో 64MP OV64B పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32MP సోనీ IMX615 ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు ఇతర ఫీచర్లు గమనిస్తే, ఇది 100W వైర్డు మరియు 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,400mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. వన్ ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను జోడించడం ఇదే మొదటిసారి. ఇది OPPO యొక్క సూపర్ ఊక్ పవర్ మేనేజ్‌మెంట్ చిప్‌తో కూడా అమర్చబడి ఉంటుంది. ఇతర ఫీచర్లలో దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం IP65 రేటింగ్, NFC, USB టైప్-C ఫీచర్లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 12 With Snapdragon 8 Gen 3 Chipset, 2K OLED Display And 5400mAh Battery Launched. Price,Specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X