వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక ఎడిషన్ విడుదల.. స్పెసిఫికేషన్లు, సేల్ వివరాలు.. !
వన్‌ప్లస్ 12R జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ (OnePlus 12R Genshin Impact Edition) భారత్‌లో లాంచ్ అయింది. ఈ ఫోన్ miHoYo యొక్క యాక్షన్ రోల్ ప్లేయింగ్ గేమ్, జెన్‌షిన్ ఇంపాక్ట్ స్ఫూర్తితో యూనిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను గేమింగ్‌ను దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేశారు. కెకెంగ్ థీమ్ కేస్ వంటి గిఫ్ట్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.
ఈ వన్‌ప్లస్ 12R జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ ఎలక్ట్రిక్ థీమ్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. వెనుక ప్యానల్‌వైపు Keqing లోగోను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC మరియు వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది.

ఈ వన్‌ప్లస్ 12R Genshin Impact ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 16GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.49,999 గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఎలక్ట్రో వైలెట్ రంగుల్లో లభిస్తుంది. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఈ వన్‌ప్లస్ 12R స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో మార్చి 19 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వన్‌కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపును పొందవచ్చు. గతంలో లాంచ్ అయిన స్టాండర్డ్ వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.39,999 గా ఉంది.

వన్‌ప్లస్ 12R జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు : వన్‌ప్లస్ 12R జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ 6.78 అంగుళాల 1.5k LTPO 4.0 అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 పైన పనిచేస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ SoC చిప్ 16GB LPDDR5X ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో వస్తుంది.
ట్రిపుల్ కెమెరా : కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX890 కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 16MP కెమెరాను అమర్చారు. ఎలక్ట్రో వైలెట్ రంగులో keqing లోగోతో వస్తుంది.
100W SuperVOOC వైరడ్ ఛార్జింగ్ సపోర్టుతో : కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 5G, 4G LTE, వైఫై 7, బ్లూటూత్ 5.3, GPS, NFS వంటి కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ గైరోస్కోప్, యాక్సిలిరోమీటర్, మాగ్నిటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ సహా ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 100W SuperVOOC వైరడ్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications