వన్‌ప్లస్ 12R స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం.. బ్యాంకు ఆఫర్ల ద్వారా ధర తగ్గింపు..!
వన్‌ప్లస్ 12R జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ (Oneplus 12R Genshin Impact Edition) ఇటీవల భారత్‌లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇవాళ్టి నుంచి కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్‌ను ప్రత్యేకించి గేమింగ్ కోసం రూపొందించారు. దీంతోపాటు ఆకట్టుకొనే డిజైన్ సహా మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు ప్రత్యేక బహుమతులు కూడా ఇవ్వనుంది.
వన్‌ప్ల్‌స్ 12R జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ కేవలం 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ తో (Oneplus 12R Genshin Impact Edition sale) అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.49,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ Oneplus.in, వన్‌ప్లస్ స్టోర్లు, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వన్‌కార్డ్ ద్వారా రూ.1000 తగ్గింపును పొందవచ్చు. మరియు రూ.4000 వరకు ఎక్స్చేంజీ బోనస్‌ను పొందవచ్చు.

ఈ వన్‌ప్లస్ 12R ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్ ఫోన్ కొనుగోలుతో పర్పల్ రంగు ఛార్జర్, ఫోన్ కేస్, సిమ్ టూల్, ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్, ఫోన్ స్టాండ్, కస్టమ్ స్టిక్కర్లును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కస్టమైజ్‌డ్ రింగ్‌టోన్, వాల్ పేపర్స్ సహా అనేక ప్రత్యేకలను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్‌ను గేమింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
వన్‌ప్లస్ 12R జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు : వన్‌ప్లస్ 12R జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ 6.78 అంగుళాల 1.5k LTPO 4.0 అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OxygenOS 14 పైన పనిచేస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ SoC చిప్ 16GB LPDDR5X ర్యామ్ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో వస్తుంది.
ట్రిపుల్ కెమెరా సహా 16MP సెల్ఫీ కెమెరా : ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX890 కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ 16MP కెమెరాను అమర్చారు. ఎలక్ట్రో వైలెట్ రంగులో keqing లోగోతో వస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 100W SuperVOOC వైరడ్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ 5G, 4G LTE, వైఫై 7, బ్లూటూత్ 5.3, GPS, NFS వంటి కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్ గైరోస్కోప్, యాక్సిలిరోమీటర్, మాగ్నిటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ సహా ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








