Home
Mobile

OnePlus నుంచి స్పెషన్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌.. స్పెసిఫికేషన్లు, సేల్‌ వివరాలు..!

వన్‌ప్లస్‌ ఇటీవల భారత్‌లో నిర్వహించిన "స్మూత్‌ బియాండ్‌ బిలీఫ్‌" ఈవెంట్‌లో OnePlus 12 మరియు 12R స్మార్ట్‌ఫోన్ల సహా వన్‌ప్లస్‌ బడ్స్‌ 3ను విడుదల చేసింది. వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌.. ప్రస్తుతం చైనా మార్కెట్‌లో ఉన్న వన్‌ప్లస్‌ Ace 3 స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా లాంచ్‌ అయింది.

వన్‌ప్లస్ 12R ప్రత్యేక ఎడిషన్ ఫోన్ : అయితే వన్‌ప్లస్‌ 12R ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 28న ప్రపంచ వ్యాప్తంగా OnePlus 12R Genshin Impact ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. అదేరోజు చైనాలో వన్‌ప్లస్‌ Ace 3 Genshine ఇంపాక్ట్‌ ఎడిషన్‌ లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

oneplus-to-launch-12r-genshine-impact-edition

ఎలక్ట్రో వైలెట్‌ కలర్‌ సహా ప్రత్యేక అప్‌డేట్‌లు : వన్‌ప్లస్ 12R ప్రత్యేక ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ కొన్ని ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఎలక్ట్రో వైలెట్‌ రంగును కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన డిజైన్‌, గేమింగ్ అనుభూతిని మెరుగుపరిచే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మిగిలిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు సాధారణ వన్‌ప్లస్ 12R మాదిరిగా ఉంటాయి.

వన్‌ప్లస్‌ 12R 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు : వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 1.5k 10 bit అమోలెడ్‌ ProXDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. HDR10+, LTPO 4 సపోర్టుతో వస్తుంది. LTPO 4వ టెక్నాలజీని కలిగి ఉన్న తొలి వన్‌ప్లస్‌ ఫోన్‌గా 12R నిలిచింది. డిస్‌ప్లే రక్షణకు కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణతో వస్తుంది.

వన్‌ప్లస్‌ 12R 5G స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు : ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX89 ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్పీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 16MP కెమెరాను అమర్చారు. ఈ వన్‌ప్లస్‌ 12r స్మార్ట్‌ఫోన్‌ 100W సూపర్‌వోక్‌ ఛార్జింగ్‌ ( వైరడ్‌ ) సపోర్టుతో 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ వేరియంట్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Oxygen OS 14 పైన పనిచేస్తుంది. మరియు స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 8GB ర్యామ్‌ +128GB అంతర్గత స్టోరేజీ, 16GB ర్యా్మ్‌ +256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంది. 8GB ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.39,999గా ఉంది. 16GB ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ.45,999గా ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 12R genshine impact edition to launch in india on February 28
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X