Home
Mobile

6.78 అంగుళాల డిస్‌ప్లే, 5500mAh బ్యాటరీ వన్‌ప్లస్‌ ఫోన్‌పై డిస్కౌంట్‌.. ఫ్లిఫ్‌కార్ట్‌, అమెజాన్‌లో సేల్‌..!!

వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ (Oneplus 12R smartphone Price Drop) ఈ సంవత్సరం భారత్‌లో విడుదల అయింది. ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు అమెజాన్‌లో బ్యాంకు ఆఫర్లతో డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

విడుదల సమయంలో వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.3,633 తగ్గింపుతో రూ.36,366 కే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లోనూ ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. అంటే రూ.37,999 కే సొంతం చేసుకోవచ్చు.

Oneplus 12R smartphone gets discount price in flipkart and amazon 2024

వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల అమోలెడ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. 1264*2780 పిక్సల్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణను పొందుతుంది. అల్యూమినియం మెటల్‌ ఫ్రేమ్‌, గ్లాస్‌ను కలిగి ఉంటుంది.

ఈ వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌.. ఆక్టా కోర్‌ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 16GB LPDDR5X ర్యామ్‌ మరియు Adreno 740 GPU తో జతచేయబడింది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OxygenOS 14 పైన పనిచేస్తుంది.

ఈ వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ, 16GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), f/1.8 అపేచర్‌తో 50MP సోనీ IMX890 ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో కూడిన 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, f/2.4 లెన్స్‌తో కూడిన 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ బ్లూటూత్‌ 5.3, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. భద్రత కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 12R smartphone gets discount price in flipkart and amazon 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X