Home
Mobile

వన్‌ప్లస్‌ 12R కొత్త వేరియంట్‌ విడుదల.. ఇవాళ్టి నుంచి సేల్‌ ప్రారంభం, ఆఫర్ల వివరాలు..!

ఇటీవల అందుబాటులోకి వచ్చిన వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ కొత్త వేరియంట్‌ ను (OnePlus 12R Smartphone New Variant) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ, 16GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా వన్‌ప్లస్‌ సంస్థ 12R 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను విడుదల చేసింది.

వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.42999 గా ఉంది. ఈ కొత్త వేరియంట్‌ ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి OnePlus.in, వన్‌ప్లస్‌ స్టోర్‌ యాప్‌ మరియు ఇతర వన్‌ప్లస్‌ స్టోర్లు, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొత్త వేరియంట్ ను ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు మరియు వన్‌కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

OnePlus 12R Smartphone New variant launched in india

దీంతోపాటు ఎక్స్చేంజీ బోనస్‌ కింద రూ.3000 తగ్గింపును పొందవచ్చు. ఎక్స్చేంజీ బోనస్‌లో భాగంగా వన్‌ప్లస్‌ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజీ చేస్తే రూ.1000 అదనపు ఎక్స్చేంజీ బోనస్‌ను పొందవచ్చు. అంటే రూ.4000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు లిమిటెడ్‌ పిరియడ్‌ ఆఫర్‌ కింద కొంత మంది వన్‌ప్లస్‌ 12r కొనుగోలుదారులు.. రూ.4,999 విలువైన వన్‌ప్లస్‌ బడ్స్‌ Z2 ఉచితంగా పొందవచ్చు.

దీంతోపాటు వన్‌ప్లస్ 12R కొత్త వేరియంట్ కొనుగోలుపై 9 నెలల నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ను పొందవచ్చు. దీంతోపాటు జియో ప్రయోజనాలు కూడా పొందవచ్చు. 15 నెలలపాటు రూ.150 చొప్పున తగ్గింపును పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.2250 వరకు ప్రయోజనాలు పొందవచ్చు.

వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల అమోలెడ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. 1264*2780 పిక్సల్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణను పొందుతుంది. అల్యూమినియం మెటల్‌ ఫ్రేమ్‌, గ్లాస్‌ను కలిగి ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్‌ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 12GB లేదా 16GB LPDDR5x ర్యామ్‌ మరియు అడెన్నో 740 GPU తో జతచేయబడింది. గరిష్ఠంగా 1TB స్టోరేజీని కలిగి ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), f/1.8 అపేచర్‌తో 50MP సోనీ IMX890 ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో కూడిన 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, f/2.4 లెన్స్‌తో కూడిన 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus 12R Smartphone New variant launched in india and sale starts from today
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X