Home
Mobile

వన్‌ప్లస్‌ 12R 5G కొత్త వేరియంట్‌ విడుదల..ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.6499 విలువైన బడ్స్‌ ఉచితం, రూ.3000 డిస్కౌంట్‌!

వన్‌ప్లస్‌ 12R 5G స్మార్ట్‌ ఫోన్‌ కొత్త వేరియంట్ భారత్‌లో విడుదల అయింది. సన్‌సెట్‌ డూన్‌ రంగులో (OnePlus 12R Sunset Dune Colour Variant) ఇవాళ లాంచ్‌ అయింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ ఫోన్‌ కూల్‌ బ్లూ, ఐరన్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం జనవరిలో ఈ హ్యాండ్‌ సెట్ భారత్‌లో విడుదల అయింది. అయితే ఒకే వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. జులై 20 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. బ్యాంకు ఆఫర్ల వివరాలను కూడా వెల్లడించింది.

వన్‌ప్లస్‌ 12R సన్‌సెట్‌ డూన్‌ కలర్‌ వేరియంట్ 8GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ లో అందుబాటులో ఉంది. ధర రూ.42999 గా ఉంది. జులై 20 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలుపై వన్‌ప్లస్‌ బడ్స్‌ 3 ను ఉచితంగా పొందవచ్చు. మరియు ICICI బ్యాంకు కార్డులు, వన్‌ప్లస్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.3000 తగ్గింపును పొందవచ్చు.

Oneplus 12R Smartphone Sunset Dune colour variant

9 నెలలపాటు నో కాస్ట్‌ EMI ప్రయోజనాలను పొందవచ్చు.
వన్‌ప్లస్‌ 12R సన్‌సెట్‌ డూన్‌ కలర్‌ వేరియంట్‌ 6.78 అంగుళాల LTPO 4.0 అమోలెడ్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. 1264*2780 పిక్సల్‌ రిజల్యూషన్‌ మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో అందుబాటులో ఉంటుంది. 100W సూపర్‌వూక్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. 12GB LPDDR5X ర్యామ్‌ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Oxygen OS 14 పైన పనిచేస్తుంది. Cryo వెలాసిటీ కూలింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

50MP+ 8MP + 2MP కెమెరాలు :
వన్‌ప్లస్‌ 12R సన్‌సెట్‌ డూన్‌ కలర్‌ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX890 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చారు.

వన్‌ప్లస్‌ 12R సన్‌సెట్‌ డూన్‌ కలర్‌ స్మార్ట్‌ఫోన్‌ డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్పీకర్లను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా Wi-Fi 7, బ్లూటూత్‌, 5.3, NFC, IR, USB-C ఛార్జింగ్‌ పోర్టులను కలిగి ఉంది. భద్రత కోసం ఈ హ్యాండ్‌ సెట్ ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ ను కలిగి ఉంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 12R Smartphone Sunset Dune colour variant launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X