Home
Mobile

OnePlus 12R New Variant వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్‌.. ఫీచర్‌లు, లాంచ్‌ పూర్తి వివరాలు!

వన్‌ప్లస్‌ నుంచి ఈ సంవత్సరం జనవరిలో వన్‌ప్లస్‌ 12 మరియు వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌ అయ్యాయి. కూల్‌ బ్లూ, ఐరన్‌ గ్రే రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా ఈ 12R స్మార్ట్‌ఫోన్‌ (OnePlus 12R New Variant) కొత్త కలర్‌ వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. వన్‌ప్లస్‌ తన అధికారిక సోషల్‌ మీడియా ద్వారా ఈ ప్రకటన చేసింది. అయితే కచ్చితంగా ఎప్పుడు లాంచ్‌ కానుందనే వివరాలను వెల్లడంచలేదు.

వన్‌ప్లస్‌ X (ట్విట్టర్‌) పోస్ట్‌ ఆధారంగా 12R హ్యాండ్‌సెట్‌ సన్‌సెట్‌ డూన్ (Sunset Dune) రంగుల్లో అందుబాటులోకి రానుందని తెలిపింది. స్టాండర్డ్‌ మోడల్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. వన్‌ప్లస్‌ 12R ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంటుంది. 100W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

OnePlus 12R Smartphone New variant launched in india

విడుదల సమయంలో వన్‌ప్లస్‌ 12R 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర రూ.39,999 గా ఉంది. 16GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.45999 గా ఉండేది. అయితే కొత్త కలర్‌ వేరియంట్ ధర సహా సేల్ వివరాలపై వన్‌ప్లస్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు.

వన్‌ ప్లస్‌ కొత్త ఉత్పత్తుల లాంచ్‌ వివరాలు : అయితే జులై 16న వన్‌ ప్లస్‌ సమ్మర్‌ లాంచ్ ఈవెంట్‌ ను నిర్వహించనుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 4, ప్యాడ్‌ 2, వాచ్‌ 2R, నార్డ్‌ బడ్స్‌ 3 ప్రో ఉత్పత్తులు లాంచ్‌ కానున్నాయి.

ఈ సంవత్సరం మార్చిలో వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌... 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ విడుదల అయింది. దీంతోపాటు మొత్తంగా 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 16GB ర్యామ్‌ +256GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో ప్రస్తుతం అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.78 అంగుళాల అమోలెడ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. 1264*2780 పిక్సల్‌ రిజల్యూషన్‌, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో అందుబాటులో ఉంది. అల్యూమినియం మెటల్‌ ఫ్రేమ్‌, గ్లాస్‌ సహా డిస్‌ప్లే రక్షణకు కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణను పొందుతుంది.

ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత Oxygen OS 14 పైన పనిచేస్తుంది. ఆక్టా కోర్‌ 4nm స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ (అండర్‌ ది హుడ్‌) కలిగి ఉంటుంది. Adreno 740 GPU తో జతచేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), f/1.8 అపేచర్‌తో 50MP సోనీ IMX890 ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో కూడిన 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, f/2.4 లెన్స్‌తో కూడిన 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
OnePlus 12R smartphone sunset dune colour variant to launch soon in india full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X